తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. టిక్ టాక్ వీడియో ఓ యువకుడి ప్రాణం తీసింది.
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. టిక్ టాక్ వీడియో ఓ యువకుడి ప్రాణం తీసింది. అప్పు చేసి పరారయ్యాడని ఫొటో పెట్టి స్నేహితులు టిక్ టాక్ వీడియో చేయడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
రాజోలుకు చెందిన మోహన్ కుమార్ ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లాడు. కాగా 2 వేల కువైట్ దినార్లు అప్పు చేసి పరారయ్యాడని మోహన్ ఫొటో పెట్టి అతని స్నేహితులు దుర్గారావు, మధు టిక్ టాక్ వీడియో చేశారు. ఈ వీడియో టిక్ టాక్ లో వైరల్ గా మారింది.
వీడియో చూసి మనస్తాపం చెందిన మోహన్.. కువైట్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. అధికారుల చొరవతో మోహన్ మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. మృతుని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరమున్నీరవుతున్నారు. గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. మోహన్ మృతికి కారణమైన దుర్గారావు, మధును కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.