మెక్సికోలో ఇంధన పైప్‌లైన్‌ పేలుడు : 66కు పెరిగిన మృతుల సంఖ్య  

మెక్సికోలో ఇంధన పైప్‌లైన్‌ పేలుడు దుర్ఘటనలో మృతుల సంఖ్య 66కు చేరింది.

  • Publish Date - January 19, 2019 / 04:06 PM IST

మెక్సికోలో ఇంధన పైప్‌లైన్‌ పేలుడు దుర్ఘటనలో మృతుల సంఖ్య 66కు చేరింది.

మెక్సికో : మెక్సికోలో ఇంధన పైప్‌లైన్‌ పేలుడు దుర్ఘటనలో మృతుల సంఖ్య 66కు చేరింది. పైప్‌‌లైన్ లీకవడంతో ఇంధనాన్ని తెచ్చుకునేందుకు సమీపంలోని ప్రజలు అక్కడకు వెళ్లారు. అదే సమయంలో పేలుడు సంభవించడంతో పలువురు సజీవదహనం అయ్యారు. మెక్సికో సిటీలోని త్లాహులిల్‌పాన్‌ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే త్లాహులిల్‌పాన్‌ ప్రాంతంలోని పెట్రో దొంగలు పైప్‌లైన్‌ను పగలగొట్టారు. పైప్‌లైన్‌ లీకవుతున్న సమాచారం తెలియగానే స్థానికులు ఇంధనాన్ని తెచ్చుకునేందుకు అక్కడకు వెళ్లారు. బకెట్లు, క్యాన్లలో ఇంధనాన్ని నింపుకున్నారు. అయితే అదే సమయంలో పైప్‌లైన్‌ పేలడంతో పెను ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తొలుత 20మంది సజీవదహనం అయ్యారు. మరో 54 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తాజాగా మృతుల సంఖ్య 66కు చేరింది. సమాచారమందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. 

ట్రెండింగ్ వార్తలు