ఏపీలో మరో దారుణం : మంగళగిరిలో వివాహితపై గ్యాంగ్ రేప్

దేశంలో ఆడవారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తెలంగాణలో దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసినా, ఏపీలో దిశ చట్టం తీసుకొచ్చినా... మహిళలపై అత్యాచారాలు కొనసాగుతూనే

  • Publish Date - February 18, 2020 / 01:55 AM IST

దేశంలో ఆడవారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తెలంగాణలో దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసినా, ఏపీలో దిశ చట్టం తీసుకొచ్చినా… మహిళలపై అత్యాచారాలు కొనసాగుతూనే

దేశంలో ఆడవారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తెలంగాణలో దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసినా, ఏపీలో దిశ చట్టం తీసుకొచ్చినా… మహిళలపై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. గుంటూరు జిల్లాలో ఓ మహిళపై ముగ్గురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం(ఫిబ్రవరి 15,2020) జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. 

లిఫ్ట్ ద్వారా పరిచయం:
ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో మరో దారుణం వెలుగు చూసింది. చినకాకానిలో ఓ వివాహితపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత మహిళ మంగళగిరి పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో…. గ్యాంగ్‌ రేప్‌ వ్యవహారం బయటకొచ్చింది. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఓ వివాహిత… ఓ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ సంస్థలో పనిచేస్తోంది. ఆమె కొద్దిరోజుల క్రితం.. విజయవాడ నుంచి స్కూటీపై వస్తున్నపుడు ఓ యువకుడికి లిఫ్ట్‌ ఇచ్చింది. అలా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. డిస్టెన్స్ కోర్సుల ద్వారా విద్యార్హతల ధృవీకరణ పత్రాలు ఇప్పిస్తానని ఆమె యువకుడితో చెప్పింది. 

సర్టిఫికెట్ల పేరుతో గ్యాంగ్ రేప్:
డిస్టెన్స్‌లో సర్టిఫికెట్స్‌ ఇప్పిస్తానని వివాహిత చెప్పిన దాన్నే తనకు అవకాశంగా మార్చుకున్నాడు. ఆమెను రప్పించేందుకు పక్కాగా ప్లాన్‌ రూపొందించాడు. తనకు, తన ఫ్రెండ్స్‌కు కూడా సర్టిఫికెట్స్‌ కావాలని కోరాడు. ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని వివాహిత తెలిపింది. దీంతో తన ఫ్రెండ్స్‌ను కలవడానికి రావాలని కోరారు. మాయ మాటలు చెప్పి ఆమెను 2020, ఫిబ్రవరి 15న మంగళగిరి మండలం చినకాకాని హాయ్‌ల్యాండ్‌ సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకొచ్చాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ముగ్గురు యువకులు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జరిగిన విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని ఆమెను బెదిరించి వెళ్లిపోయారు.

నిందితులు అరెస్ట్:
రేప్‌ జరిగిన మరునాడు వివాహిత మంగళగిరి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సామూహిక అత్యారానికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అత్యాచారానికి పాల్పడింది…. చైతన్య, ఆశీర్వాదం, నాగేశ్వర్‌గా అనుమానిస్తున్నారు.

Read More>> బ్యాంకుల్లో పర్సనల్ లోన్, సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లు ఇవే!