Grandson Kicked Grandmother
Grandson Kicked Grandmother : పింఛన్ డబ్బుల కోసం ఓ మనువడు రాక్షసుడిలా మారాడు. పండు ముసలమ్మ అనే జాలి కూడా లేకుండా సొంత నాయనమ్మను కాలితో తన్నాడు. మద్యం కోసం డబ్బులివ్వాలని బూతులు తిడుతూ టార్చర్ పెట్టాడు. వికారాబాద్ జిల్లా మంబాపూర్‌కు చెందిన యశోదమ్మ తన మనవళ్లతో కలిసి ఉంటోంది. కొడుకు, కోడలు గతంలోనే చనిపోయారు. పెద్ద మనవడు కూడా కన్నూమూశాడు.
ఇద్దరు మనువళ్లు పంచాయతీ కార్మికులుగా పని చేస్తున్నారు. యశోదమ్మకు ఆసరా పింఛన్ వస్తుంది. అదే ఆమెకు ఆధారం. మూడు రోజుల క్రితం పింఛన్ డబ్బులను పెద్ద మనుమడు గోవర్దన్ తీసుకున్నాడు. నిన్న మళ్లీ.. 600 ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చాడు.
Dead Body Fridge : తాత మృతదేహాన్ని ఫ్రిడ్జ్ లో దాచి పెట్టిన మనవడు
ఆమె ఇవ్వనని చెప్పడంతో బూతులు తిడుతూ కాలితో తన్నుతూ.. అమానవీయంగా ప్రవర్తించాడు. ఈ తతంగాన్నంతా.. ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. వైరల్‌గా మారింది. గోవర్దన్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.