హాజీపూర్ వరుస హత్యల కేసులో ఈనెల 27న తీర్పు

  • Publish Date - January 17, 2020 / 10:44 AM IST

నల్గొండ జిల్లా హాజీపూర్ లో జరిగిన వరుస హత్యల కేసులో ఫాస్ట్ట్ ట్రాక్ కోర్టులో శుక్రవారం వాదనలు ముగిసాయి. శ్రీనివాసరెడ్డే బాలికలను హత్య చేశాడని చెప్పడానకి ఆధారాలున్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్  కోర్టుకు వివరించారు. నిందితుడికి గతంలో కూడా నేర చరిత్ర  ఉందని  ఈకేసును అత్యంత అరుదైన  కేసుగా పరిగణించి  నిందితుడికి మరణ శిక్ష విధించాలని న్యాయస్ధానాన్ని కోరారు. కాగా నిందితుడి  తరుఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ నెల 27 న  తుది తీర్పు ఇవ్వనున్నట్లు తెలిపింది.