యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో మర్డర్ మిస్టరీలు కలకలం రేపుతున్నాయి. ఒకే బావిలో రెండు మృతదేహాలు లభ్యం కావడం సంచలనంగా మారింది. 10వ తరగతి విద్యార్థిని శ్రావణిని అతి కిరాతకంగా చంపి మృతదేహాన్ని పూడ్చిపెట్టిన బావిలోనే డిగ్రీ విద్యార్థిని మనీషా డెడ్ బాడీ కూడా దొరికింది. నెల రోజుల క్రితం అదృశ్యమైన మనీషా.. ఇప్పుడు మృతదేహంగా కనిపించింది. ఒకే బావి నుంచి ఇద్దరు అమ్మాయిల మృతదేహాలు బయటపడటం గ్రామస్తులను ఉలిక్కిపడేలా చేసింది. అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నది ఎవరు? వారిని చంపుతున్నది ఎవరు? అనేది మిస్టరీగా మారింది.
Also Read : అదృష్టం వెన్నంటే ఉంటే : రెండు బాంబు దాడుల నుంచి బతికి బయటపడ్డాడు
మృతదేహాలు పూడ్చిపెట్టిన బావి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అది ఓ పాడుబడిన బావి. ఆ బావిని గుర్తించడం చాలా కష్టం. మెయిన్ రోడ్డుకి 30 అడుగుల దూరంలో ఉంటుంది. ఊరికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ బావి బాగా లోతుగా ఉంది. అందులోకి దిగడమే చాలా కష్టం. అలాంటిది డెడ్ బాడీతో బావిలోకి దిగడం, మృతదేహాన్ని పూడ్చిపెట్టి మళ్లీ పైకి రావడం అంత సులభం కాదంటున్నారు. ఆ బావి గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్ రెడ్డిది. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు. శ్రావణి మర్డర్ కేసులో అనుమానితుడిగా శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డిని విచారిస్తున్న సమయంలోనే మనీషా విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీనివాస్ రెడ్డి నుంచి రాబట్టిన సమాచారంతో పోలీసులు మనీషా మృతదేహం గురించి తెలుసుకున్నారు. బావిలో నుంచి వెలికితీశారు.
బావి.. శ్రీనివాస్ రెడ్డిది కావడం, అతడికి నేరచరిత్ర ఉండటంతో ఈ దారుణాలు అతడే చేసి ఉంటాడని గ్రామస్తులు, పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి నేరం రుజువైతే.. అతడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. దేశం ఉలిక్కిపడేలా నడిరోడ్డుపై ఉరితియ్యాలన్నారు. నేరం చెయ్యాలంటే భయపడేలా శ్రీనివాస్ రెడ్డిని శిక్షించాలన్నారు. అంతేకాదు శ్రీనివాస్ రెడ్డి పేరు మీదున్న ఆస్తులను శ్రావణి, మనీషా కుటుంబసభ్యులకు పంచాలన్నారు. శ్రీనివాస్ రెడ్డి బావిలోకి దిగి తిరిగి పైకి రావడంలో సిద్ధహస్తుడు అనే విషయం పోలీసుల విచారణలో బయటపడింది. దీంతో శ్రీనివాస్ రెడ్డి పై అనుమానాలు పెరుగుతున్నాయి.
Also Read : గిఫ్ట్ విసిరికొట్టాడు : పక్కనే పెళ్లికూతురు.. PUBGతో పెళ్లికొడుకు ఫుల్ బిజీ