కొండా విశ్వేశ్వరరెడ్డికి షరతులతో బెయిల్

  • Publish Date - May 15, 2019 / 11:55 AM IST

ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. బెయిల్ పత్రాలతో పాటు షూరిటీ ఇవ్వడానికి కొండా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఎన్నికల సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు ఆయనపై కేసులు నమోదు చేశారు. దీంతో కొండా విశ్వేశ్వరరెడ్డి ముందస్తు బెయిల్ కు అప్లై చేశారు. ఈ క్రమంలో ఆయనకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 

ఎన్నికల సమయంలో డబ్బుల వ్యవహారంలో తనిఖీలు చేసేందుకు, నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన ఎస్ఐతో కొండా విశ్వేశ్వరరెడ్డి మిస్ బిహేవియర్, విధులకు ఆటంకం కల్గించిన సందర్భంగా ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే ఆందోళనతో.. ముందస్తు బెయిల్ కోరారు. డాక్యుమెంట్లతోపాటు మధ్యవర్తిని కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు ఆయన. 

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి సన్నిహితుడు సందీప్ రెడ్డి దగ్గర 10 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసు విచారణలో భాగంగా పోలీసులు బంజారాహిల్స్ లోని విశ్వేశ్వరరెడ్డి ఇంటికి వెళ్లిన సమయంలో.. విశ్వేశ్వరెడ్డి రెడ్డి అనుచరులు ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ ను నిర్బంధించారు. దీంతో వారు బంజారాహిల్స్ పోలీసులకు కంప్లయింట్ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కారణంగా కొండా విశ్వేశ్వరరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈమేరకు ఆయన తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టు ఆయన పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో కొండా హైకోర్టును ఆశ్రయించారు.