Hit And Run (Photo Credit : Google)
Hit And Run Case : ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది. రోడ్డు పక్కన కూర్చుని మాట్లాడుకుంటున్న ముగ్గురు స్నేహితులపై నుంచి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు స్పాట్ లోనే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫరూకాబాద్ లోని కొత్వాలి-ఫతేఘర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ముగ్గురు స్నేహితులు రోడ్డు పక్కన కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
ఆ రోడ్డు చాలా క్లియర్ గా ఉంది. అక్కడ ఎలాంటి ట్రాఫిక్ కూడా లేదు. ఇంతలో వేగంగా దూసుకొచ్చిన కారు.. ఆ ముగ్గురిని గుద్దేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కారు వేగంగా వచ్చి గుద్దేయడంతో వారంతా ఎగిరిపడ్డారు. ఈ క్రమంలో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. మరొ ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. కాగా, యాక్సిడెంట్ తర్వాత డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
కాగా, రోడ్డు పైన కానీ, రోడ్డు పక్కన కానీ కూర్చోవడం చాలా ప్రమాదకరం. రోడ్డుపై వాహనాలు వేగంగా తిరుగుతుంటాయి. ఆ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది. వాహనాలు రావడం లేదనో, ఏమీ కాదనే నిర్లక్ష్యం ఎంతమాత్రమూ మంచిది కాదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇదిగో ఇలా మూల్యం చెల్లించుకోకతప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Also Read : తల్లిదండ్రులూ బీ కేర్‌ఫుల్..! రైలు ప్రయాణంలో పిల్లల చేతికి ఫోన్ ఇస్తున్నారా? ఎంత ప్రమాదమో చూడండి..