Tirupati Hotel Bomb Threat : తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఓ హోటల్ లో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. రాజ్ పార్క్ హోటల్ లో బాంబు ఉందంటూ కాల్ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నిన్న కూడా నాలుగు హోటళ్లను పేల్చివేస్తామని కాల్స్ వచ్చాయి. నాలుగు హోటల్స్ ను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఎలాంటి పేలుడు పదార్ధాలు లభించలేదని పోలీసులు తెలిపారు.
తిరుపతిలో బాంబు బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. అర్థరాత్రి దాటిన తర్వాత నగరంలోని రెండు హోటళ్లు.. రాజ్ పార్క్, పై వైస్రాయ్.. ఈ రెండు హోటల్స్ కు గత రాత్రి బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. మీ హోటళ్లను పేల్చివేస్తాం అంటూ బెదిరింపు లేఖ సారాంశం. వెంటనే హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు.. హోటల్స్ లో తనిఖీలు నిర్వహించారు. పై వైస్రాయ్, రాజ్ పార్క్.. ఈ రెండు హోటళ్లు కూడా పక్కపక్కనే ఉంటాయి. ఈ రెండింటిలో బాంబు స్వ్కాడ్ తనిఖీలు నిర్వహించింది.
రెండు రోజుల క్రితం నగరంలోని మరో నాలుగు హోటల్స్ కు ఇదే తరహాలో బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో రెండు రోజుల పాటు ఆ హోటల్స్ లో పూర్తి స్థాయిలో తనిఖీలు చేశారు పోలీసులు. రాజ్ పార్క్, పై వైస్రాయ్ హోటళ్లు.. అలిపిరికి అతి సమీపంలో ఉన్నాయి. ఈ రెండు హోటళ్లకు తాజాగా బాంబు బెదిరింపు వచ్చింది. డాగ్ స్క్కావ్, బాంబు స్వ్కాడ్.. కుణ్ణంగా తనిఖీలు నిర్వహించాయి. అయితే, ఇది కూడా దాదాపుగా ఒక ఉత్తుత్తి బెదిరింపుగానే పోలీసులు భావిస్తున్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ నుంచి ఈ బెదిరింపులు వస్తున్నాయి అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఎందుకిలా జరుగుతోంది? ప్రత్యేకంగా తిరుపతిలోని హోటల్స్ కే ఇలాంటి బెదిరింపు ఈ మెయిల్స్ ఎందుకు వస్తున్నాయి? అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది.
జిల్లా పోలీసులు మాత్రం ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా హోటల్ అంతా.. గదులు, రిస్పెప్షన్, టాయ్ లెట్స్, పార్కింగ్ ఏరియా.. ఇలా అన్ని ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో అలాంటి ఆనవాళ్లు ఏవీ పోలీసులు గమనించలేదని సమాచారం.
Also Read : ఆస్తులు భారతివైతే ఆమె కూడా జైలుకి వెళ్లాలి కదా? అంటూ జగన్‌పై షర్మిల సంచలన కామెంట్స్.. కంటతడి