ఈ బార్ గర్ల్.. ముంబై క్రైమ్ క్వీన్ గా ఎలా మారింది

యాస్మిన్ షేక్.. ముంబైకి చెందిన మహిళ. ఆమె గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే క్రైమ్ క్వీన్. ముంబైలో యాస్మిన్ గురించి తెలియని వారుండరు. ఎందుకంటే అందరూ ఆమె

  • Publish Date - February 16, 2020 / 10:44 AM IST

యాస్మిన్ షేక్.. ముంబైకి చెందిన మహిళ. ఆమె గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే క్రైమ్ క్వీన్. ముంబైలో యాస్మిన్ గురించి తెలియని వారుండరు. ఎందుకంటే అందరూ ఆమె

యాస్మిన్ షేక్.. ముంబైకి చెందిన సాధారణ మహిళ. ఆమె గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే క్రైమ్ క్వీన్. ముంబైలో యాస్మిన్ గురించి తెలియని వారుండరు. ఎందుకంటే అందరూ ఆమె బాధితులే. ఏ పోలీస్ స్టేషన్ లో చూసినా ఆమెపై కేసులు ఉన్నాయి. రైల్వే స్టేషన్ లే ఆమె అడ్డా. మహిళా ప్రయాణికులే టార్గెట్. ఇట్టే మాయ చేస్తుంది. మహిళా ప్రయాణికుల కన్నుకప్పి దోచేస్తుంది. దొరికినకాడికి దోచుకుని పారిపోతుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పదేళ్లు దొంగతనాలు చేసింది. 37 ఏళ్ల యాస్మిన్.. ప్రస్తుతం వడాలా పోలీసుల కస్టడీలో ఉంది.

యాస్మిన్ జీవితంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఓ బార్ గర్ల్ గా యాస్మిన్ జీవితం ప్రారంభమైంది. యాంటోప్ హిల్ లో నివాసం. బార్ లో గర్ల్ గా పని చేస్తున్న యాస్మిన్ కు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం షాక్ ఇచ్చింది. ప్రభుత్వం బార్లపై నిషేధం విధించడంతో యాస్మిన్ తన ఉపాధి కోల్పోయింది. బతుకుదెరువు కోసం కొత్త దారి ఎంచుకుంది. అదే క్రైమ్.

యాస్మిన్ దొంగగా మారింది. ముందు ఓ మహిళతో దోస్తీ చేసింది. చైన్ స్నాచింగ్‌లు చేయడం మొదలు పెట్టింది. ఎవరూ గుర్తు పెట్టకుండా.. బుర్ఖా ధరించాలని పార్టనర్ చెప్పడంతో.. బుర్ఖా ధరించడం స్టార్ట్ చేసింది. అలా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడింది. యాస్మిన్ షేక్ రెండు పెళ్లిళ్లు చేసుకుంది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. 15 ఏళ్ల పెద్ద కూతురిని పంచ్ గనిలోని ఓ బోర్డింగ్ స్కూల్ లో చదివిస్తోంది.

జనవరి 26న ఓ టీచర్.. వడాలా రైల్వే పోలీసులను ఆశ్రయించింది. కుర్లాలో తన బంగారు గొలుగు చోరీ అయ్యిందని ఫిర్యాదు చేసింది. బుర్ఖా వేసుకుని వచ్చిన ఓ మహిళ తన పక్కనే కూర్చుందని, ట్రైన్ దిగాక చూస్తే.. తన మెడలో మంగళసూత్రం లేదని, అలాగే పక్కనున్న మహిళ కూడా కనిపించలేదని పోలీసులతో చెప్పింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీ చెక్ చేశారు.

అందులో.. బుర్ఖా ధరించిన మహిళని యాస్మిన్ షేక్ గా గుర్తించారు. వెంటనే ఆమె ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో తనిఖీలు చేయగా.. 5 తులాల గోల్డ్ చైన్ కనిపించింది. అనుమానం వచ్చిన పోలీసులు.. యాస్మిన్ ఇంటిని మొత్తం తనిఖీ చేశారు. వారి అనుమానం నిజమైంది. ఆ ఇంట్లో మరిన్ని విలువైన ఆభరణాలు, నగదు, ఖాళీ టిఫిన్ బాక్సులు కనిపించాయి. అలాగే చోరీ చేసిన సెల్ ఫోన్లూ ఉన్నాయి. వాటి విలువ రూ.8లక్షలు ఉంటుందని పోలీసులు తేల్చారు. అలాగే ఇంటి కోసం యాస్మిన్ రూ.15లక్షలు ఖర్చు చేసిందని పోలీసుల విచారణలో తేలింది.

యాస్మిన్ ఎలా చోరీలు చేస్తుందనేది విచారణలో పోలీసులు తెలుసుకున్నారు. చిన్న పిల్లను తీసుకుని రైలు బోగీలోకి వెళ్తుంది. టార్గెట్ చేసిన మహిళ పక్కన నిల్చుంటుంది. తన వెంట తెచ్చుకున్న చిన్నారిని యాస్మిన్ గట్టిగా గిల్లుతుంది. ఆ చిన్నారి ఏడవటం మొదలుపెట్టగానే.. అందరూ అటు వైపు చూస్తారు. ఇంతలోనే యాస్మిన్ తన టార్గెట్ చేసిన మహిళ వస్తువులు దోచేస్తుంది. సీసీ కెమెరాల్లో ఎక్కడా తన ముఖం కనిపించకుండా.. యాస్మిన్ ముఖాన్ని బ్యాగ్ తో కవర్ చేసుకుంటుంది. ఇదీ యాస్మిన్ క్రైమ్ స్టోరీ.

ప్రస్తుతం యాస్మిన్ పోలీసుల అదుపులో ఉంది. ఆమె క్రైమ్ స్టోరీ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. పదేళ్ల కాలంలో ఎన్ని నేరాలు చేసిందో తెలుసుకుంటున్నారు. యాస్మిన్ గురించి తెలుసుకున్న బాధితులు ఒక్కొక్కరు పోలీసుల దగ్గరికి వస్తున్నారు. పోయిన వస్తువుల గురించి ఫిర్యాదు చేస్తున్నారు.