husband harassment
Husband Harassment : భర్త పెట్టే అరాచకాలపై ఓ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను కులం పేరుతో దూషిస్తూ… తీవ్రంగా కొడుతూ అర్ధనగ్నంగా ఉండమంటాడని..మూత్రం తాగాలని బలవంతం చేస్తాడని ఓ వివాహిత భర్త అకృత్యాలపై జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.
నారాయణపేట మక్తల్ కు చెందిన మహిళ హైదరాబాద్ రహామత్ నగర్‌లో నివసిస్తోంది. ఆమె 2016 లో ప్రేమ వివాహాం చేసుకుంది. అప్పటినుంచి భర్త ఆమెను హింసించ సాగాడు. గర్భం దాల్చినా గర్భ స్రావం చేయించాడు. 2020 నుంచి భర్త, అతని సోదరుడు, సోదరి బావ, ఆమెను కులంపేరుతో దూషించసాగారు.
Also Read : Rural CI Misbehaviour : మహిళా పోలీసుతో సీఐ అసభ్య ప్రవర్తన-సస్పెన్షన్ వేటు
పలు మార్లు పెట్రోల్ పోసి చంపేస్తానంటూ అత్తింటివారు బెదిరింపులకు దిగేవారని తన ఫిర్యాదులో బాధిత మహిళ పేర్కోంది. వివాహానంతరం భర్తకు రూ. 1.50 లక్షలు ఇచ్చింది. అయినా అత్తింటి వారి వేధింపులు ఆగలేదని వాపోయింది. దీంతో పోలీసులు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.