వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను, మహిళను కట్టేసి కొట్టిన భార్య

Husband is an illicit affair, wife caught and crushed, Khammam : తాళి కట్టిన భార్యను మభ్య పెట్టి వేరే మహిళతో సంబంధం పెట్టుకున్న వ్యక్తిని అతడి భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బుధ్ది చెప్పిన ఘటన ఖమ్మంలో  జరిగింది. ఖమ్మంలోని గట్టయ్య సెంటర్ లో నివసించే శీను అనే వ్యక్తి ఈవెంట్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. అతనికి కోర్టు కాలనీకి చెందిన కవిత అనే మహిళతో 20 ఏళ్ల క్రితం పెళ్ళి అయ్యింది.

ఈ మధ్య కాలంలో అతను తరచూ భార్యతో గొడవ పడుతున్నాడు. కాగా…. గట్టయ్య సెంటర్ లో భార్యకు తెలియకుండా  శీను వేరే ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఆ ఇంట్లో వివాహేతర సంబంధం పెట్టుకున్న వేరే మహిళతో జీవిస్తున్నాడు. రోజూ ఉదయం బయటకు వెళ్తున్నానని ఇంట్లో భార్యకు చెప్పి, ఆ మహిళ వద్దకు వచ్చి ఉండటం చేస్తున్నాడు.

కొంత కాలంగా భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య కవిత… బంధువుల సహాయంతో భర్తపై నిఘా పెట్టింది. సోమవారం తెల్లవారుఝూమున గట్టయ్య సెంటర్ కు భర్త వెళ్లటం చూసిన భార్య, బంధువులతో కలిసి ఆ ఇంట్లోకి వెళ్లింది. పరాయి మహిళతో ఉన్న తన భర్తతో పాటు ఆ మహిళను చేతులు కట్టేసి, ఇద్దరినీ చితక బాదారు. అనంతరం భర్తను ఆ మహిళను ఖమ్మం టూటౌన్ పోలీసులకు అప్పగించారు.