husband kills self : భార్యా, ఆమె ప్రియుడి వేధింపులు భరించలేక భర్త ఆత్మహత్య

పెళ్లికి ముందే వేరోకరితో ప్రేమ వ్యవహారం ఉన్నయువతి పెళ్లనై తర్వాత ప్రియుడితో కలిసి భర్తను వేధించటంతో మనస్తాపానికిగురైన భర్త అత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా మాల్యాల మండలం నూకపల్లి లో చోటుచేసుకుంది.

Husband End Life

husband kills self, harassment by wife and her boy friend : పెళ్లికి ముందే వేరోకరితో ప్రేమ వ్యవహారం ఉన్నయువతి పెళ్లనై తర్వాత ప్రియుడితో కలిసి భర్తను వేధించటంతో మనస్తాపానికిగురైన భర్త అత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా మాల్యాల మండలం నూకపల్లి లో చోటుచేసుకుంది.

మాల్యాలకు చెందిన అట్టపల్లి రాజుకు (30) గొల్లపల్లిమండలం బొంకూరు గ్రామానికి చెందిన రమ్యతో ఏడాది క్రితం వివాహం జరిగింది. రమ్యకు అప్పటికే తుంగూరుకు చెందిన రాజేందర్ అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు రాజు తెలుసుకున్నాడు. ఈ విషయం రాజుకి త్వరలోనే తెలిసిపోయింది.

రాజేందర్ తో భార్య చనువుగా ఉండటం చూసి పద్ధతి మార్చుకోవాలని భార్యను హెచ్చరించాడుయ అయినా ఆమె తన పధ్ధతి మార్చుకోలేదు. అయినా ప్రియుడ్ని కలుస్తూనే ఉంది. కొద్ది రోజుల క్రితం రమ్య గర్భం దాల్చింది. తన ప్రియుడివల్లే గర్భం దాల్చానని చెప్పి ..తల్లి గారింటికివెళ్లి అబార్షన్ చేయించుకుంది.

అప్పటి నుంచి భార్య రమ్య, ఆమె ప్రియుడు రాజేందర్, రాజుకు ఫోన్ చేసి నువ్వు బతికి ఉండటం వృధా, చచ్చిపో అంటూ మానసికంగా వేధించసాగారు. దీంతోమనస్తాపం చెందిన రాజు మంగళవారం రాత్రి ఇంటినుంచి వెళ్ళిపోయి నూకపల్లి శివారులోని వరదకాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు కాలువ వద్ద గాలించగా రాజు…చెప్పులు, బైక్ అక్కడ లభ్యమయ్యాయి. కాలువలో గాలించగా మృతదేహం కూడా లభ్యమయ్యింది. కోడలు ఆమె ప్రియుడి వేధింపుల వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తండ్రి నాగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న మాల్యాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.