Husband Suicide : భార్య వేధింపులతో డీఎంకే నేత ఆత్మహత్య

భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక చెన్నైకి చెందిన డీఎంకే నేత సెల్ఫీ వీడియో తీసకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Husband Suicide : భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక చెన్నైకి చెందిన డీఎంకే నేత సెల్ఫీ వీడియో తీసకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నైలోని 115 వ డివిజన్ డీఎంకే యూత్ వింగ్ డిప్యూటీ ఆర్గనైజర్ గా విద్యాకుమార్ పని చేస్తున్నారు. అతని భార్య నిశాంతిని. వీరిద్దరి మధ్య గత కొంత కాలంగా విభేదాలు వచ్చాయి. దీంతో ఎప్పుడూ గొడవపడుతూ ఉండేవారు.

ఈక్రమంలో నిశాంతిని తన సోదరి, తండ్రితో కలిసి భర్తను కొట్టటం ప్రారంభించింది. అది రానురాను ఎక్కవయ్యింది. చెప్పుకోలేని విధంగా విద్యాకుమారను వారు హింసించసాగారు. భార్య ఆమె కుటుంబ సభ్యులు పెట్టే బాధలు పడలేక ఈ నెల 4వ తేదీన విద్యాకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న  జాంబజార్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యాకుమార్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని దాని ద్వారా దర్యాప్తు మొదలెట్టారు. అందులోని వీడియోలను పరిశీలించగా విద్యాకుమార్ తీసుకున్నసెల్పీ వీడియో బయట పడింది.

Also Read : Blade Batch : విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం

నా భార్య తన బంధువులు మాటలు వింటోంది. నేను చేయని అఘాయిత్యాలు తాను చేసుకుని అవి నా మీద నెడుతోంది…రాత్రి నిద్రపోతున్నప్పడు గుండెలపై కూర్చుని కొట్టటం తో పాటు వాతలు పెడుతోంది అని భార్యపెడ్తున పలు హింసాత్మక ఘటనలు వివరించాడు. అలాగే నన్ను అసభ్య పదజాలంతో దూషిస్తోందని ఏడుస్తూ చెపుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.

నా భార్య నిశాంతిని, ఆమె సోదరి ఉష, మామ కన్నన్ లే నా ఆత్మహత్యకు కారణమని వీడియోలో పేర్కోన్నాడు. నా తల్లితండ్రులను బాగా చూసుకోండి అని చెప్పి విద్యాకుమార్ ఆత్మ హత్య చేసుకున్నాడు. వీడియోలను కీలకసాక్ష్యాలుగా తీసుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు ప్రేరేపించారనే కారణంతో ముగ్గురిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు.

 

ట్రెండింగ్ వార్తలు