Domalaguda Robbery Case : హైదరాబాద్ దోమలగూడ భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..

సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాఫ్తు చేసిన పోలీసులు ఆ ముఠాలోని ఐదుగురిని అరెస్ట్ చేశారు.

Domalaguda Robbery Case : హైదరాబాద్ దోమలగూడలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు చేధించారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దొంగలను పట్టుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి కత్తులు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 13న గోల్డ్ వ్యాపారులైన ఇద్దరు అన్నదమ్ముల ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు దుండగులు. సినీ ఫక్కీలో తుపాకులు, ఆయుధాలతో బెదిరించి దోపిడీ చేశారు.

ఇంట్లోని బంగారం, కుటుంబ సభ్యుల ఒంటిపై ఉన్న నగలతో పాటు వారి సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఆధారాలు దొరక్కుండా సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ లను కూడా తీసుకెళ్లిపోయారు. దుండగులు తీసుకెళ్లిన సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాఫ్తు చేసిన పోలీసులు ఆ ముఠాలోని ఐదుగురిని అరెస్ట్ చేశారు.

 

Also Read : పుష్ప సినిమాపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు