CPI Narayana : పుష్ప సినిమాకు సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వమే తొలి ముద్దాయి- సీపీఐ నారాయణ

ఒక రకంగా రాజకీయ నాయకుల నైతిక ప్రవర్తన కూడా బాధాకరం..

CPI Narayana : పుష్ప సినిమాకు సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వమే తొలి ముద్దాయి- సీపీఐ నారాయణ

Updated On : December 22, 2024 / 4:41 PM IST

CPI Narayana : స్మగ్లింగ్ ను ప్రోత్సహించిన సినిమాకు తెలంగాణ ప్రభుత్వం రాయితీలు ఇచ్చిందంటూ సీపీఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మగ్లింగ్ ను గౌరవంగా చూపించిన పుష్ప సినిమా సమాజానికి ఏం సందేశం ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. అలాంటి సినిమాకు సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వమే సంధ్య థియేటర్ ఘటనలో తొలి ముద్దాయి అని విమర్శించారు. సంధ్య థియేటర్ ఘటన సభ్య సమాజం సిగ్గుతో తల వంచి తీవ్రంగా ఖండించాలన్నారు. ప్రభుత్వం, పుష్ప చిత్ర యూనిట్ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

‘సినిమా అనేది ఎర్ర చందనం స్మగ్లింగ్ కు సంబంధించినది. హీనాతి హీనమైన సినిమా అది. అది ఏం సందేశం ఇస్తుంది. స్మగ్లింగ్ బాగా చేసుకోమని ఇస్తుందా? అలాంటి సినిమాలో అనేక అసహ్యకరమైన సీన్లు ఉన్నాయి. స్మగ్లింగ్, బూతు పాటలు.. ఈ రెండు సమాజానికి చీడ పరుగు లాంటివి. గవర్న్ మెంట్ సిగ్గు లేకుండా వాళ్లని ప్రోత్సహించింది. టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. 3వేల రూపాయలకు పెంచుకోమని ప్రభుత్వం చెబితే వాళ్లు రూ.6వేలకు అమ్ముకున్నారు.

ప్రభుత్వం రాయితీలు ఎందుకు ఇవ్వాలి. అదేమైనా ఆదర్శం నింపే సినిమానా? జాతికి, సమాజానికి ఉపయోగపడే సినిమా కాదు కదా. కాబట్టి ప్రభుత్వం అలాంటి వాటిని ప్రోత్సహించడం తప్పు. ఈ ఘటన జరిగిన తర్వాత రాజకీయ నాయకులంతా ఉత్సాహంగా వాళ్ల ఇంటికి వెళ్తున్నారు. సినిమా యాక్టర్స్ కు తప్పదు. రాజకీయ నాయకులకు ఏమైంది. ఎందుకు ప్రోత్సహించారు. ఒక రకంగా రాజకీయ నాయకుల నైతిక ప్రవర్తన కూడా బాధాకరం’ అని నారాయణ అన్నారు.

Also Read : సినిమా కలెక్షన్ల మీద ధ్యాస తప్ప.. ప్రజలు ఏమైతున్నరో పట్టదా..? కాంగ్రెస్ ఎంపీ ఫైర్