Gold Robbery Case : హైదరాబాద్‌లో రూ.కోటి విలువైన బంగారం చోరీ కేసు.. 48గంటల్లోనే దొంగలు అరెస్ట్

హైదరాబాద్ లో బంగారు ఆభరణాలను చోరీ చేసి పరారైన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వెస్ట్ బెంగాల్ కు చెందిన నలుగురు దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి కోటి రూపాయల విలువైన ఆభరణాలతో పాటు వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు.

Gold Robbery Case : హైదరాబాద్ లో బంగారు ఆభరణాలను చోరీ చేసి పరారైన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వెస్ట్ బెంగాల్ కు చెందిన నలుగురు దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి కోటి రూపాయల విలువైన ఆభరణాలతో పాటు వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు.

బంగారు ఆభరణాలకు తుది మెరుగులు దిద్దడం కోసం వ్యాపారి గోపాలకృష్ణ.. నలుగురు తయారీదారులకు గోల్డ్ ఇచ్చాడు. బంగారం తీసుకున్న ఆ నలుగురు దాంతో పారిపోయారు. ముందుగా విజయవాడ వెళ్లారు. అక్కడి నుంచి వెస్ట్ బెంగాల్ హౌరాకు వెళ్లారు. ఫిబ్రవరి 18న బాధితుడు అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Also Read..Gold Jewellery Robbery Case : రూ.7కోట్ల విలువైన బంగారు నగలతో కారు డ్రైవర్ పరారీ కేసు.. శ్రీనివాస్ దొరికాడు

వెంటనే అప్రమ్తతమైన పోలీసులు ఆంధ్రప్రదేశ్, హౌరా పోలీసుల సహకారంతో నిందితులను ట్రేస్ చేశారు. మొబైల్ ఫోన్ ట్రాకింగ్ ఆధారంగా నిందితులను హౌరాలో పట్టుకున్నారు. అయితే, బంగారం వ్యాపారి గోపాలకృష్ణ దగ్గర నిందితులు మూడేళ్లుగా పని చేస్తున్నారని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వరులు చెప్పారు.

Young Woman Video Call Cheating : యువతి నగ్నంగా యువకుడికి వీడియో కాల్.. రూ.60 వేలు ఇవ్వకపోతే వీడియో యూట్యూబ్ లో పెడతానని బెదిరింపు

వారిని హిమాన్షు, మహదేవ్, ఓజాలుగా గుర్తించారు. ఏడాది క్రితం పనిలోకి వచ్చిన కార్తిక్ అనే వ్యక్తి సలహాతో మిగతా ముగ్గురు ఈ దొంగతనానికి పాల్పడ్డారు. వీరిని హౌరాలో పట్టుకున్న పోలీసులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను రిమాండ్ కు తరలించారు. 48 గంటల్లోనే బంగారం చోరీ కేసుని చేధించామని డీసీపీ తెలిపారు. బంగారు నగలు తయారీ చేయించడానికి ఇచ్చే ముందు వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. వారు ఎలాంటి వారు? ఏ ప్రాంతానికి చెందిన వారు? తెలుసుకోవాలన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ట్రెండింగ్ వార్తలు