Hyderabad Drugs
Hyderabad Drugs : రాష్ట్రంలో డ్రగ్స్ రవాణా, వినియోగానికి పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ పోలీసులు కళ్లు గప్పి డ్రగ్స్ మాఫియా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు.
అతని వద్దనుంచి 70 గ్రాముల డ్రగ్స్, సెల్ ఫోన్,కారును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు 10 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : P Chidambaram: మోదీకే ఇది సాధ్యం: దేశంలో విద్యుత్ కొరతపై కాంగ్రెస్ నేత పీ.చిదంబరం వ్యంగ్యాస్త్రాలు