అక్రమ సంబంధమే ఆత్మహత్యకు కారణం

  • Publish Date - May 4, 2020 / 09:58 AM IST

అక్రమ సంబంధం వారి జీవితాల్లో చిచ్చు రేపింది.  రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.  రెండు రోజుల క్రితం వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవుల్లో వెలుగు చూసిన అస్ధి పంజరాల కేసులో ఇద్దరూ ప్రేమికులని తేలింది. వివాహేతర సంబంధమే ఆత్మహత్యలకు కారణమని తెలిసింది. ఇద్దరికీ అంతకు ముందే వేరే వారితో వివాహమయ్యింది. ఆత్మహత్య చేసుకున్న నెల రోజుల తర్వాత  వారి మృతదేహాలు గుర్తు పట్టలేని స్ధితిలో కుళ్లిపోయి ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి. 

వారిని…వికారాబాద్ జిల్లా కోట్ పల్లికి చెందిన జనగాం  మహేందర్(38)  ఇందోల్ కు చెందిన శివనీల (36) గా పోలీసులు గుర్తించారు.  జనగాం  మహేందర్ భార్యతో కలిసి ధారూర్ లోనివాసం ఉంటూ భవననిర్మాణ మేస్త్రీగా పని చేస్తున్నాడు.  అతనికి ఇందోల్ కు చెందిన కూలీ శివనీల తో పరిచయం ఏర్పడింది.  వీరి పరిచయం క్రమేణా వివాహేతర సంబంధానికి దారి తీసింది. 

ఇరువైపులా  కుటుంబాల్లో తెలీయకుండా ఇద్దరూ చాలాకాలం  ఆ సంబంధాన్ని కొనసాగించారు. అయితే తన భర్త వేరే మహిళతో వివాహేతర సబంధం పెట్టుకున్నాడని మహేందర్ భార్యకు తెలియటంతో అలిగి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. మరోవైపు తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని శివనీల భర్త కూడా తెలియటంతో వారి కాపురంలో గొడవలు మొదలయ్యాయి.

భర్తతో గొడవలు భరించలేని శివనీల ఏప్రిల్5న ….ధారుర్ లోని  ప్రియుడు మహేందర్ ఇంటికి వచ్చింది. అనంతరం ఇద్దరూ కలిసి  బైక్ పై  వెళ్ళారు. ఏప్రిల్ న శివనీల కుటుంబ సభ్యులు శివనీల కనపడటంలేదని,మహేందర్ పై అనుమానం వ్యక్తే చేస్తూ ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారిని పట్టుకోటానికి ప్రయత్నించారు.  

 

ఇద్దరి సెల్ ఫోన్ సిగ్నల్స్ అనంతగిరి అటవీ ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు రోజులకు ఇద్దరి ఫోన్ల్ స్విఛ్చాఫ్ కావటంతో ఇక వారు ఎక్కడ ఉన్నది గుర్తించలేక పోయారు.  కాగా మే2వ తేదీ శనివారం ఉదయం కొందరు పశువుల కాపర్లు అడవిలో చెట్టుకు శవాలు వేలాడుతున్నాయని ఇచ్చిన సమాచారంతో ఘటనా స్ధలానికి  చేరుకున్న పోలీసులు…. అక్కడ ఉన్న బైక్  ఆధారంగా  వారిని 0మహేందర్,నీల గా గుర్తించారు.  అక్రమ సంబంధం కుటుంబాల్లో గొడవలు రేపి….అవమానం భరించలేక ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 
 

Also Read | అత్త రాస లీలలు….వద్దన్న అల్లుడు…ప్రియుడితో కలసి హత్య చేసిన అత్త