Thailand
Thailand : థాయ్ లాండ్ లో ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠాను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 90మంది భారతీయులను పటాయ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో 16మంది మహిళలు కూడా ఉన్నారు. వారి నుంచి రూ.1.60 లక్షల నగదు, 20 కోట్ల విలువైన గేమింగ్ చిప్స్ స్వాధీనం చేసుకున్నారు.
పటాయ పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో తెలంగాణకు చెందిన కీలక వ్యక్తులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో గ్యాంబ్లింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులే థాయ్ లాండ్ లో గ్యాంబ్లింగ్ నిర్వహించినట్లు అనుమానిస్తున్నారు. అరెస్ట్ అయిన వారిలో మెదక్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read..AP Politics: సైలెంట్ అయ్యారు..! చంద్రబాబు, పవన్ భేటీ.. ఏపీ బీజేపీలో మారుతున్న సమీకరణాలు..
గ్యాంబ్లింగ్ ముఠాను థాయ్ ల్యాండ్ లోని పటాయ పోలీసులు అరెస్ట్ చేశారు. 93మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇల్లీగల్ గా కేసినో, గేమింగ్ నిర్వహిస్తున్న ముఠాని అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 27వ తేదీన ఒక హోటల్ లో కాన్ఫరెన్స్ హాల్ తీసుకుని గేమింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. పోలీసులు రైడ్ చేసి గ్యాంబ్లింగ్ ముఠాను అరెస్ట్ చేశారు. 93మంది నిందితులను అదుపులోకి తీసుకోగా, వారిలో 71మంది పురుషులు ఉన్నారు. 16మంది మహిళలు కూడా ఉన్నారు.
మొత్తం 20కోట్ల రూపాయల విలువైన గేమింగ్ చిప్స్ తో పాటు కొంత క్యాష్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కీ రోల్ పోషించిన మహిళ హోటల్ ని అద్దెకి తీసుకుని గేమింగ్ నిర్వహించినట్లు గుర్తించారు. ఒక్కో కస్టమర్ నుంచి రూ. 2లక్షల నుంచి రూ.3లక్షలు వసూలు చేసి పెద్ద ఎత్తున గేమింగ్ నిర్వహించారు. ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ నాయకులను, వారి కుమారులను స్పెషల్ ఫ్లైట్ లో తీసుకెళ్లి గేమింగ్ నిర్వహించారు. గతంలో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న వారు, గ్యాంబ్లింగ్ గేమ్ నిర్వహించిన కేసులో ఉన్న వారంతా.. ఈ గ్యాంబ్లింగ్ ముఠా కేసులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అరెస్ట్ అయిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు కీలక నేతలు కూడా ఉన్నారు. వారిలో గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న వారు, కేసులు నమోదైన వారూ ఉన్నారు. గతంలో వారిందరినీ ఈడీ అధికారులు విచారించారు. ఇప్పుడు కూడా వారే అక్కడ ప్రత్యక్షం కావడం, అరెస్ట్ కావడం ప్రస్తుతం సంచలనంగా మారింది.