AP Politics: సైలెంట్ అయ్యారు..! చంద్రబాబు, పవన్ భేటీ.. ఏపీ బీజేపీలో మారుతున్న సమీకరణాలు..

మొదటి నుంచి టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని ఏపీ బీజేపీలోని ఓ వర్గం తెగేసి చెబుతుంది. అయితే, పవన్ నేరుగా ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతలతో మాట్లాడడంతో ఏపీ బీజేపీలోనూ సమీకరణాలు మారుతున్నట్లు చర్చజరుగుతుంది.

AP Politics: సైలెంట్ అయ్యారు..! చంద్రబాబు, పవన్ భేటీ.. ఏపీ బీజేపీలో మారుతున్న సమీకరణాలు..

Chandrababu and Pawan Kalyan

AP Politics: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక్కటిగా ఎన్నికల బరిలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో పలు దఫాలుగా పవన్‌, చంద్రబాబు భేటీలు జరిగాయి. కానీ, రెండు రోజుల క్రితం చంద్రబాబు, పవన్ భేటీతో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వీరి భేటీపై ఏపీ బీజేపీలో భిన్నమైన వాతావరణం నెలకొంది.

Chandrababu Naidu: రజనీకాంత్‌పై వైసీపీ నేతల విమర్శలకు చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్..

గతంలో రెండు దఫాలుగా చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు. ఆ సమయంలో ఏపీ బీజేపీ నేతలు సీరియస్‌గా స్పందించారు. తాజగా మూడోసారి వారు భేటీ కావటంపై ఏపీ బీజేపీ నేతల్లో సానుకూల వాతావరణం కనిపిస్తోంది. రాజకీయాల్లో భేటీలు జరుగుతూనే ఉంటాయంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. రాష్ట్రం తిరోగమనంలో ప్రయాణిస్తున్నందున పురోగమనంలోకి తీసుకొచ్చే విషయాలపై చర్చిస్తున్నామంటూ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వ్యాఖ్యానించారు.

Rajinikanth : YCP నాయకులపై ఫైర్ అవుతున్న తలైవా ఫ్యాన్స్.. ట్రెండింగ్ లో #YSRCPApologizeRajini

మొదటి నుంచి టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని ఏపీ బీజేపీలోని ఓ వర్గం తెగేసి చెబుతుంది. అయితే, పవన్ నేరుగా ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతలతో మాట్లాడడంతో ఏపీ బీజేపీలోనూ సమీకరణాలు మారుతున్నాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల దిశగా అడుగులు పడుతున్నాయంటూ బీజేపీలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిన్నమొన్నటి వరకు చంద్రబాబు, టీడీపీ నేతలపై ఏపీ బీజేపీ నేతలు విమర్శలు చేస్తూ వచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మోదీ పాలనను చంద్రబాబు ఆకాశానికెత్తారు. అప్పటి నుంచి చంద్రబాబు‌పై ఏపీ బీజేపీ నేతలుసైతం నోరు మెదపడం లేదు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు‌సైతం సైలెంట్ అయ్యారు. తాజా పరిణామాలపై నోరువిప్పేందుకు ఢిల్లీ నుంచి ఆదేశాలకోసం వెయిటింగ్ చేస్తున్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

Kishan Reddy : కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు

పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ నేతలతో కాకుండా నేరుగా‌ బీజేపీ అధిష్టానంతో మాట్లాడుతుండడం, తర్వాత చంద్రబాబు‌తోనే‌ మాట్లాడుతుండడంపై బీజేపీ శ్రేణుల్లో ఒకింత ఆగ్రహం వ్యక్తమవుతున్నప్పటికీ, ముఖ్యనేతలు నోరు మెదపక పోవటంతో పార్టీలోని ద్వితీయశ్రేణి నేతలుసైతం తాజా పరిణామాలపై మాట్లాడేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. మొత్తానికి ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ ఏపీ బీజేపీలో కొత్త సమీకరణలకు దారితీస్తోందని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది.