ఐసిస్ చీఫ్ కుక్క చావు..కన్ఫర్మ్ చేసిన ట్రంప్

ఐసిస్ ఉగ్రసంస్థ చీఫ్ అబూ బకర్‌ ఆల్‌-బాగ్దాదీ చనిపోయినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఇవాళ(అక్టోబర్-27,2019)ప్రకటించారు. వైట్ హౌస్ లో ట్రంప్ మాట్లాడుతూ…సిరియాలో డెడ్ ఎండ్ టన్నెల్‌లో అమెరికా స్పెషల్ ఫోర్స్ ఆపరేటర్లు అబూ బకర్ ని గుర్తించారని,అమెరికా సేనలు దాడి చేయడం కంటే ముందే…అబూ బకర్ తనంట తానుగా సూసైడ్ వెస్ట్(కోటు)ధరించి తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడని ట్రంప్ ప్రకటించాడు. 

పేలడుతో అబూ బకర్ శరీరం ముక్కలు అయిపోయిందని ట్రంప్ తెలిపారు. డీఎన్ఏ టెస్టులు కూడా చేశామని.. చనిపోయింది బాగ్దాదియే అని తేలిందని తెలిపారు.  ప్రపంచవ్యాప్తంగా మారణహోమం సృష్టించిన బాగ్దాది చివరకు పిరికివాడిలా సొరంగంలో దాక్కుని ఏడ్చాడని…ఆపై ఆత్మాహుతి చేసుకుని చనిపోయాడని అన్నారు. అబూ బకర్ కుక్క చావు చచ్చాడని అన్నారు.

అబూ బకర్ ని మట్టుబెట్టడానికి కొన్ని వారాల నుంచి నిఘా పెట్టామని…రెండు,మూడు మిషన్స్ ఫెయిల్ అయ్యాక ఎట్టకేలకు మరో మిషన్‌లో అతను మృతి చెందాడని తెలిపారు. మిషన్ సందర్భంగా అమెరికా వైమానిక సేనలు రష్యా గగన తలంపై నుంచి ఎగిరాయని తెలిపారు. అమెరికాలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి ఆపరేషన్ మొత్తాన్ని వీక్షించినట్టు చెప్పారు. అబూ బకర్ కి సంబంధించి కీలక సమాచారాన్ని సిరియన్ కుర్దులు అమెరికాకు ఇచ్చారని తెలిపారు. అమెరికా ఆపరేషన్‌కు సహకరించినందుకు రష్యా,టర్కీ,సిరియా,ఇరాక్‌లకు ట్రంప్ థ్యాంక్స్ చెప్పారు.