కాబూల్ లో ఆత్మాహుతి దాడి…16మంది మృతి

ఆఫ్గనిస్తాన్ నుంచి 5వేల మంది తమ సైన్యాన్ని ఉపసంహరించుకునేందుకు అమెరికా అంగీకారం తెలిపిన కొన్ని గంటల్లోనే కాబూల్ రక్తసిక్తమయింది. తాలిబన్లు-అమెరికాకు మధ్య శాంతి డీల్ ఫైనల్ అయ్యే సమయంలో కాబూల్ లో  బ్లాస్ట్ జరిగింది.

సెంట్రల్ కాబుల్‌లోని గ్రీన్ విలేజ్ సమీపంలో పలు అంతర్జాతీయ సంస్థలు నెలకొని ఉన్న నివాస ప్రాంతంలో ఆత్మాహుతి దాడి జరిగింది. కారులో వచ్చిన దుండగుడు కారుతో సహా తనను తాను పేల్చుకోవడంతో 16 మృతి చెందగా, 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నామని, కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి నస్రత్ రహిమి తెలిపారు. ఈ ఘటనకు తామే బాధ్యత వహిస్తున్నట్లు తాలిబన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.