చెన్నై : సినిమా రంగుల ప్రపంచం..అక్కడ రంగులే కాదు ఎవ్వరికీ కనిపించని వెలిసిపోయిన రంగులు కొందరు నటీనటులవి. కష్టాలు ఎక్కువగా ఉంటే సినిమా కష్టాలు అంటు జోకులేస్తుంటాం. కానీ సినిమావాళ్లు కూడా సాధారణ మనుష్యలే..వారికి కూడా కష్టాలుంటాయని ఎన్నో సందర్భాలల్లో చూశాం. వెండితెరపై దశాబ్దాలపాటు వెలిగిపోయినవారు కూడా చివరి రోజుల్లో కటిక దారిద్ర్యంలో మగ్గిపోయినవారు ఎందరో. అటువంటి ఓ దీనస్థితిలో మునిగిపోయింది ఓ హీరోయిన్. ఒకప్పుడు హీరోయిన్‌గా రాణించిన విజయలక్ష్మి అనారోగ్యంతో ఆసుపత్రి పాలై బిల్ కట్టనేని దీన స్థితిలో సాయం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.
కన్నడలో నాగమండల, సూర్యవంశ చిత్రాలతో పలు విజయవంతమైన చిత్రాలలో నటించిన విజయలక్ష్మి.. తెలుగులో ‘హనుమాన్ జంక్షన్’ చిత్రంలో జగపతిబాబు..అర్జుల చెల్లెలుగా నటించింది. తరువాత తరువాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కన్నడ సీరియల్స్‌తో బిజీ అయి ఇప్పుడు ఇప్పుడు అవి కూడా లేక చాలా కష్టాల్లో పడ్డారు. అవకాశాలు లేకపోవటం..మరోవైపు విజయలక్ష్మి తల్లి తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఉన్న డబ్బు కాస్తా హరించుకుపోయింది. ఈ క్రమంలో సడెన్‌గా విజయలక్ష్మి బీపీ లెవల్స్ విపరీతంగా పెరిగిపోవడంతో బెంగుళూరులోని మల్లయ్య హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యింది. ప్రస్తుతం ఆమెకు ఐసీయులో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నా..కొంతకాలంపాటు ట్రీట్ మెంట్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు డాక్టర్స్.
హాస్పటల్ బిల్ కట్టేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో సాయం చేయాలంటూ విజయలక్ష్మి చెల్లెలు ఉషాదేవి కోరుతున్నారు. మా అమ్మ హెల్త్ కండిషన్ బాగోలేకపోవటం..ఇప్పుడు మా అక్క విజయలక్ష్మి ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదంటు ఆమె ఆసుపత్రిలో దీన స్థితిలో ఉన్నారు. దయచేసి సినిమా ఇండస్ట్రీ మా అక్కను ఆదుకోవాలి’ అంటూ సాయం కోరారు ఉషాదేవి. దీంతో వెంటనే స్పందించిన కన్నడ ఛాంబర్ సభ్యులు. ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి భా. మా హరీష్, ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు ఆసుపత్రికి స్వయంగా వెళ్లి విజయలక్ష్మిని కలిశారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వివరాలను తెలుసుకుని ఆర్ధిక సాయం అందించారు.