Kerala teacher arrested: 20 మంది బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన టీచర్ అరెస్ట్

కేరళలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు.. పాఠశాలలోని బాలికల పట్ల పశువులా ప్రవర్తించాడు. 52 ఏళ్ల వయసు ఉన్న ఆ ఉపాధ్యాయుడు 20 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కన్నూర్ జిల్లాలోని తలిపరంబ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

mumbai rape arrested

Kerala teacher arrested: కేరళలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు.. పాఠశాలలోని బాలికల పట్ల పశువులా ప్రవర్తించాడు. 52 ఏళ్ల వయసు ఉన్న ఆ ఉపాధ్యాయుడు 20 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కన్నూర్ జిల్లాలోని తలిపరంబ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆ మృగాడి పేరు ఫైజాన్ అని అతడు మలప్పురం జిల్లాలోని కొండొట్టీలో నివసిస్తుంటాడని పోలీసులు చెప్పారు. అతడిని అరెస్టు చేశామని, 14 రోజుల పోలీసు కస్టడీలో ఉన్నాడని పోలీసులు వివరించారు. ఉపాధ్యాయుడు తమను లైంగికంగా వేధిస్తున్నాడని విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో అతడిపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

చిన్నారులపై లైంగికదాడుల నిరోధక చట్టం (పోక్సో)లోని 7,8,9,10 సెక్షన్లతో పాటు, ఐపీసీ సెక్షన్ 354 కింద ఆ మృగాడిపై కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఆరు, ఏడో తరగతికి చెందిన ఐదుగురు విద్యార్థుల నుంచి వివరాలు తీసుకున్నామని చెప్పారు.

మరి కొంతమంది విద్యార్థుల నుంచి స్టేట్ మెంట్ తీసుకుంటామని తెలిపారు. పాఠశాలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న వేళ 20 మంది విద్యార్థినులు తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి బడి అధికారులకు వివరించారని అన్నారు. అనంతరం ఆ అధికారులు పోలీసులకు దీనిపై సమాచారం అందించారని తెలిపారు.

Vande Bharat Express: ఆదివారం మినహా మిగతా రోజుల్లో అందుబాటులో.. తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైలు టైమింగ్స్ ఇవే..