మరో వివాదంలో నిత్యానంద : అమ్మాయిలను కిడ్నాప్ చేశారని కేసు

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి మరో వివాదంలో చిక్కుకున్నాడు. నిత్యానందపై కిడ్నాప్ కేసు నమోదైంది. ఇద్దరు అమ్మాయిలను కిడ్నాప్ చేసినట్టు పోలీసులకు

  • Publish Date - November 20, 2019 / 03:40 PM IST

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి మరో వివాదంలో చిక్కుకున్నాడు. నిత్యానందపై కిడ్నాప్ కేసు నమోదైంది. ఇద్దరు అమ్మాయిలను కిడ్నాప్ చేసినట్టు పోలీసులకు

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి మరో వివాదంలో చిక్కుకున్నాడు. నిత్యానందపై కిడ్నాప్ కేసు నమోదైంది. ఇద్దరు అమ్మాయిలను కిడ్నాప్ చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. నిత్యానంద ఇద్దరు శిష్యులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. తమ ఇద్దరు కూతుళ్లను నిత్యానంద స్వామి అహ్మదాబాద్‌లోని తన సర్వజన ఆశ్రమంలో బంధించాడని బెంగళూరుకు చెందిన జనార్ధనస్వామి దంపతులు ఆరోపిస్తున్నారు. నిత్యానంద ఆశ్రమం నుంచి తమ కుమార్తెలను తమకు అప్పగించేందుకు ఆశ్రమ నిర్వాహకులను ఆదేశించాలని కోరుతూ గుజరాత్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం(నవంబర్ 20,2019) విచారణ జరిగింది. 

జనార్ధన శర్మ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అహ్మదాబాద్ పోలీసులు నిత్యానంద స్వామి ఆశ్రమంలో తనిఖీలు జరిపారు. అమ్మాయిల స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. కేసులో నిత్యానంద స్వామిని విచారించేందుకు పోలీసులు వెతుకుతున్నారు. కేసు దర్యాప్తు సాగుతుండగానే నిత్యానంద స్వామి ఓ వీడియో విడుదల చేశారు. ఆరోపణలు చుట్టుముట్టిన వేళ అహ్మదాబాద్ భక్తులు తనకు అండగా నిలిచిన తీరు అద్భుతమని కొనియాడారు. ఆశ్రమంలో ఎవరినీ నిర్బంధించ లేదని, పిల్లలను కలవకుండా తల్లిదండ్రులెవరినీ అడ్డుకోలేదని స్పష్టం చేశారు. ఎవరినైనా కలవాలా వద్దా అన్నది వారి ఇష్ట ప్రకారమే ఉంటుందన్నారు. 

7 నుంచి పదిహేనేళ్ల మధ్య వయసున్న తన నలుగురు పిల్లలను నిత్యానంద స్వామి ఆధ్వర్యంలో నడిచే ఓ సంస్థలో 2013లో చేర్పించామని జనార్ధన శర్మ తన పిటిషన్‌లో తెలిపారు. అయితే నిత్యానంద తమను సంప్రదించకుండా పిల్లలు నలుగురినీ అహ్మదాబాద్‌లోని తన ఆశ్రమంలోని మరో సంస్థకు తరలించారని ఆరోపించారు. తమకు ఈ విషయం తెలియగానే, నలుగురు పిల్లలను మళ్లీ అహ్మదాబాద్‌లోని సర్వజనపీఠానికి రహస్యంగా తరలించారని తెలిపారు. పిల్లలను కలుసుకునేందుకు ఆ ఆశ్రమానికి తాము వెళితే లోపలకు అనుమతించ లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

దీంతో స్థానిక పోలీసులు, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సాయతో తన ఇద్దరు మైనర్ బాలికలను వెనక్కి తీసుకొచ్చామన్నారు. అయితే తమ పెద్ద కుమార్తె లోపముద్ర(21), రెండో కుమార్తె నందిత(18) తమతో వచ్చేందుకు నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ్రమ నిర్వాహకుల బెదిరింపులకు భయపడి వారు తమతో రాలేదన్నారు. కోర్టు జోక్యం చేసుకుని తమ కుమార్తెలిద్దరినీ తమకు అప్పగించాలని కోరారు. శర్మ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అహ్మదాబాద్ రూరల్ పోలీసులు నిత్యానందతో పాటు ఆశ్రమంలోని ఇతర అధికారులపై కేసు నమోదు చేశారు.