KPHB : కేపీహెచ్‌బీ కాలనీ ఫోరం సర్కిల్ వద్ద కారు బీభత్సం.. మద్యం మత్తులో మాజీ మంత్రి మేనల్లుడు

కూకట్ పల్లి కాలనీ ఫోరం సర్కిల్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అగ్రజ్ రెడ్డి అనే వ్యక్తి కారు నడిపి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు.

Car driving

Car Accident in Kukatpally : కూకట్ పల్లి కాలనీ ఫోరం సర్కిల్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అగ్రజ్ రెడ్డి అనే వ్యక్తి కారు నడిపి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఆదివారం అర్థరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : Cyber Crimes : పెండింగ్ చ‌లాన్లు చెల్లిస్తున్నారా..? ఈ విష‌యం తెలుసుకోండి

మద్యం మత్తులో కారు నడిపి ప్రమాదానికి కారణమైన అగ్రజ్ రెడ్డి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడుగా తెలిసింది. హోండా సిటీ కారులో అగ్రజ్ రెడ్డితోపాటు మరో ఇద్దరు ఉన్నారు. గచ్చిబౌలిలోని ఓ పబ్ లో పార్టీ చేసుకున్న అగ్రజ్ రెడ్డితో పాటు కార్తీక్, తేజలు కారులో బయలుదేరారు. అగ్రజ్ రెడ్డి మద్యం మత్తులో కారును రాంగ్ రూట్లో పోనివ్వడంతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలిసింది. అగ్రజ్ కు బ్రీత్ అనలైజ్ పరీక్ష నిర్వహించగా.. ఆల్కహాల్ 90శాతం నమోదైనట్లు తెలిసింది. కారు ప్రమాదంలో గాయపడ్డ వారిలో రాజస్థాన్ చెందిన కార్మికులు దూర్ చంద్, బాన్వర్ లాల్ గా పోలీసులు గుర్తించారు.

ఘనటపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐపీసీ 185(ఏ), 337, 119177 ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కేపీహెచ్ బీ పోలీసులు చెప్పారు. గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికిలో వైద్యలు చికిత్స అందిస్తున్నారు.