హీరో రాజ్ తరుణ్ ఇంటి ముందు రచ్చ రచ్చ చేసిన లావణ్య.. ఏం చేసిందో చూడండి..

ప్రసాద్ ల్యాబ్ నుండి రాజ్ తరుణ్ తప్పించుకుని మాల్వి మల్హోత్రాతో వెళ్ళిపోయాడని లావణ్య ఆరోపించింది.

హీరో రాజ్ తరుణ్ ఇంటి ముందు రచ్చ రచ్చ చేసిన లావణ్య.. ఏం చేసిందో చూడండి..

Lavanya Raj Tarun Row : హీరో రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారం దుమారం రేపిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ పై లావణ్య చేసిన తీవ్రమైన ఆరోపణలు ఇప్పటికే సంచలనంగా మారాయి. ఈ వ్యవహారం పోలీస్ కేసుల వరకు వెళ్లింది. ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. ఇద్దరి మధ్య వివాదం కంటిన్యూ అవుతోంది.

తాజాగా మరోసారి లావణ్య రచ్చ చేసింది. ఈసారి లావణ్య ఏకంగా రాజ్ తరుణ్ ఇంటికి వెళ్లింది. మాదాపూర్ కాకతీయ హిల్స్ లో రాజ్ తరుణ్ ఇంటి ముందు లావణ్య ఆందోళనకు దిగింది. ఇంటి తలుపులు తీయాలని లావణ్య గట్టిగట్టిగా కేకలు వేసింది. తనకు న్యాయం చేయాలని రాజ్ తరుణ్ తల్లిదండ్రులను కోరింది. రాజ్ తరుణ్ ఎక్కడున్నా వెంటనే రావాలని డిమాండ్ చేసింది. రాజ్ తరుణ్ తో తన రిలేషన్ పై పలు ఆధారాలతో రాజ్ తరుణ్ ఇంటికి వెళ్లింది లావణ్య. ప్రసాద్ ల్యాబ్ నుండి రాజ్ తరుణ్ తప్పించుకుని మాల్వి మల్హోత్రాతో వెళ్ళిపోయాడని లావణ్య అంది.

Also Read : లావణ్య వివాదంపై ఎట్టకేలకు స్పందించిన రాజ్ తరుణ్.. నేను కొన్ని పేర్లు బయటపెట్టట్లేదు..