Transgender Suspicious Death : సహజీవనం చేస్తున్న ట్రాన్స్‌జెండర్‌ అనుమానాస్పద మృతి

ఒకవ్యక్తితో సహజీవనం చేస్తున్న ట్రాన్స్ జెండర్ అనుమామానస్పద స్ధితిలో మృతిచెందిన ఘటన హైదరాబాద్ చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Transgender Suspicious Death

Transgender Suspicious Death :  ఒకవ్యక్తితో సహజీవనం చేస్తున్న ట్రాన్స్ జెండర్ అనుమామానస్పద స్ధితిలో మృతి చెందిన ఘటన హైదరాబాద్ చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ బుద్ద తండాకు చెందిన వంకునావత్‌ మహేష్‌(23) అనే యువకుడు మూడేళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చి జీవనం సాగిస్తున్నాడు. కొన్నాళ్లకు లింగమార్పిడి చికిత్స చేయించుకున్న మహేష్‌ తన పేరును అమృతగా మార్చుకున్నాడు. రెండేళ్లుగా చైతన్యపురి మోహన్‌నగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు.

ఈక్రమంలో అతనికి ఎన్‌టీఆర్‌  నగర్‌కు చెందిన షేక్‌ జావేద్‌తో పరిచయం ఏర్పడింది.  వీరిద్దరూ చైతన్యపురిలో సహజీవనం చేస్తున్నారు. ఇటీవల జావేద్ అమృతను వేధించసాగాడు. కొన్ని సార్లు కొట్టడంకూడా జరిగింది. జావేద్ వేధింపులు, కొట్టటం గురించి ఇటీవల అమృత బడంగ్‌పేటలో నివసించే సోదరుడు శ్రీనుకు ఫోన్‌లో చెప్పింది.

కాగా….మంగళవారం సాయంత్రం ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీకి చెందిన కిషన్‌ అనే వ్యక్తి  అమృత సోదరుడు శ్రీనుకు ఫోన్‌ చేసి అమృత చనిపోయిందని చెప్పారు. వెంటనే అమృత ఉండే గదికి వచ్చి చూడగా మంచంపై చనిపోయి కనిపించింది.  శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించినట్లు  చైతన్యపురి పోలీసు స్టేషన్  ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.