Tirupati Couple Suicide : తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. గోవిందరాజస్వామి ఆలయం ఉత్తర మాడవీధిలోని ఓ లాడ్జిలో ఫ్యాన్ కు ఉరేసుకుని యువతీ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఈ జంట నిన్న ఉదయం 7 గంటలకు లాడ్జిలో దిగింది. ఇవాళ ఆత్మహత్య చేసుకున్నారు. కాగా.. యువతికి ఇటీవల వేరే యువకుడితో పెళ్లి జరిగింది. ప్రేమ వ్యవహారంతో వీరిద్దరూ ఇలా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
యువతిని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన అనూషగా.. యువకుడిని హైదరాబాద్ చెందిన కృష్ణారావుగా గుర్తించారు పోలీసులు. లాడ్జి సిబ్బంది సమాచారంతో స్పాట్ కి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.