Chain Snatching : చైన్‌ స్నాచింగ్ లతో ఫ్లాట్, కారు కొన్న ఇంజినీర్

కష్టపడి డబ్బులు సంపాదించలేక ఈజీమనీకి అలవాటు పడిన ఇంజనీర్ చైన్ స్నాచింగ్‌లు చేసి ఫ్లాట్, కారు, కొన్న ఉదంతం మహారాష్ట్రలో  వెలుగు చూసింది.

Chain Snatching :  కష్టపడి డబ్బులు సంపాదించలేక ఈజీమనీకి అలవాటు పడిన ఇంజనీర్ చైన్ స్నాచింగ్‌లు చేసి ఫ్లాట్, కారు, కొన్న ఉదంతం మహారాష్ట్రలో  వెలుగు చూసింది.  ముంబైలో  సెక్యూరిటీ గార్డుగా  పని చేస్తున్న ఒక వ్యక్తి   కొడుకు ఉమేశ్ పాటిల్ 2015 లో ఇంజనీరింగ్  పూర్తి చేశాడు. ఉమేష్ 20 చైన్ స్నాచింగ్ లు, తూషార్ ధిక్లే అనే భాగస్వామితో కలిసి 36 చైన్ స్నాచింగ్‌లు చేశాడు. ఆ తర్వాత నుంచి తానొక్కడే చైన్ స్నాచింగ్‌లు చేయటం మొదలెట్టాడు. ఈ క్రమంలో ఒక రోజు పోలీసులకు చిక్కాడు.

పాటిల్ ఒక రోజు రోడ్డు మీద బైక్‌పై వెళుతుండగా బంగారు నగలు ధరించి వెళుతున్న మహిళను చూశాడు. ఆమె మెడలోని బంగారు గొలుసు దొంగతనం చేయటానికి ఆమె ముందు యూ టర్న్ తీసుకున్నాడు. అదే సమయంలో పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు అతడ్ని చూసి వెంబడించారు. పోలీసులకు చిక్కకుండా పాటిల్ బైక్‌ను వేగంగా నడిపాడు. మొత్తానికి ఒక చోట పోలీసులు పాటిల్ బైక్‌ను ఢీ కొట్టారు. దీంతో ముగ్గురు కిందపడ్డారు. అయినా పోలీసులు ఉమేష్ పాటిల్‌ను పట్టుకున్నారు. పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారణ చేయగా ఉమేష్ చేసిన చైన్ స్నాచింగ్‌ల లిస్ట్ బయట పడింది.
Also Read : Widow killed in Guntakal : గుత్తిలో దారుణం : వితంతు కోడలిని హత్య చేసిన మామ
2015లో ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఒక కాంట్రాక్టర్‌తో కలిసి పని చేయటం ప్రారంభించాడు. ఆ సమయంలో తనకు వస్తున్న జీతంతో ఏ మాత్రం సంతృప్తి చెందని ఉమేష్ ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్ లు చేయటం మొదలెట్టాడు. ఈ సమయంలో తుషార్ ధిక్లే అనే వ్యక్తిని తన భాగస్వామిగా చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి చైన్ స్నాచింగ్ లు మొదలు పెట్టారు.

ఈ చైన్ స్నాచింగ్ లతో  సంపాదించిన డబ్బుతో రూ. 48 లక్షలు విలువ చేసే ఫ్లాట్. కారు కొనుగోలు చేశాడు. అతని ఇల్లు సోదా చేయగా రూ. 2.5లక్షల నగదు,27 బంగారు గొలుసులు దొరికాయి. అతని బ్యాంకు ఖాతాలో రూ. 20లక్షల నిల్వలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఉమేష్ పాటిల్‌తో పాటు….అతని భాగస్వామి తుషార్ ధిక్లేను, వారి వద్ద నగలు కొన్న నలుగురు నగల వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు.chain snatcher

ట్రెండింగ్ వార్తలు