Mysuru : మైసూరులో సీఐడీ అధికారుల దాడి..9 పాములు, 4 పిల్లుల స్వాధీనం

మైసూరు నగరంలో ఓ వ్యక్తి ఇంటి నుంచి 9 పాములు, 4 పిల్లులను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నగరంలో ఓ వ్యక్తి ఇంటిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ ఫారెస్ట్ సెల్ అధికారులు దాడి చేశారు....

Mysuru Man arrest

Mysuru : మైసూరు నగరంలో ఓ వ్యక్తి ఇంటి నుంచి 9 పాములు, 4 పిల్లులను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నగరంలో ఓ వ్యక్తి ఇంటిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ ఫారెస్ట్ సెల్ అధికారులు దాడి చేశారు. మైసూర్ లోని సందీప్ అలియాస్ దీపు అనే వ్యక్తి ఇంటిపై దాడి చేసిన సీఐడీ అధికారులు తొమ్మిది రకాల పాములు, నాలుగు సివెట్ పిల్లులను స్వాధీనం చేసుకున్నారు. (Man arrested for illegal possession of 9 snake species)

Iraq Fire During Wedding : ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం…100మంది మృతి, 150 మందికి గాయాలు

నాలుగు కళ్లద్దాల నాగుపాములు, ట్రింకెట్ స్నేక్ లు రెండు, సా స్కాల్డ్ వైపర్ లు రెండు ,రెండు ఎలుక పాములను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. నిందితుడి వద్ద నుంచి పాములే కాకుండా పాము విషం మిల్కింగ్ యూనిట్ కూడా స్వాధీనం చేసుకున్నారు.

Anti-Drone Systems : ఇక సరిహద్దు రాష్ట్రాల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు…కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా వెల్లడి

అతని ఇంటి నుంచి సబ్‌డల్ట్‌లుగా ఉన్న నాలుగు సివెట్ పిల్లులను కూడా స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణుల రక్షణ చట్టం 1972లోని వివిధ నిబంధనల ప్రకారం సందీప్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.