Hyderabad : యువతిపై దాడి చేసిన మాజీ ప్రియుడు

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఒక యువతిపై ఆమె మాజీ ప్రియుడు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది.

Hyderabad : హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఒక యువతిపై ఆమె మాజీ ప్రియుడు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. కూకట్‌పల్లికి చెందిన జిబిన్ అనే యువకుడికి రెండేళ్ల క్రితం ఒక బ్యూటీషియన్‌తో  పరిచయం ఏర్పడింది. బాగానేసాగుతున్న వారి ప్రేమాయణంలో  కలతలు మొదలయ్యాయి. దీంతో   కొద్ది కాలంగా ఇద్దరు వేరు వేరుగా ఉంటున్నారు.
Also Read : Tirumala Garuda Seva శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
ఈనెల 11 న ఆమెతో మాట్లాడాలి   రమ్మనమని   జూబ్లి హిల్స్ లోని స్పాయిల్ పబ్ కి పిలిచాడు.  అక్కడ ఆమెను అసభ్యకరంగా దూషిస్తూ మెడపట్టి గెంటేసాడు జిబిన్.  ఆక్రమంలో యువతికి గాయాలయ్యాయి.  గాయాలైన యువతిని  ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం బాధితురాలు జూబ్లీ‌హిల్స్ పోలీసు స్టేషన్‌లో  మాజీ ప్రియుడు జిబిన్ పై   ఫిర్యాదు చేసింది.

ట్రెండింగ్ వార్తలు