Murder Attempt : గుంటూరులో కత్తితో యువకుడి హల్ చల్

గుంటూరు అరండల్ పేట 4 వ లైన్ లో సోమవారం మధ్యాహ్నం కత్తితో ఒక యువకుడి హల్ చల్ చేశాడు. యువజంటపై దాడి చేసేందుకు యత్నించాడు.

Man Attack With Knife On Couple In Guntur

Murder Attempt : గుంటూరు అరండల్ పేట 4 వ లైన్ లో సోమవారం మధ్యాహ్నం కత్తితో ఒక యువకుడు హల్ చల్ చేశాడు. యువజంటపై దాడి చేసేందుకు యత్నించాడు. ఆమెతో ఉన్న యువకుడిని చంపుతానంటూ కత్తి చూపిస్తూ బెదిరించాడు.   అతనిపై దాడిచేసేందుకు యత్నించగా ఆ యువతి అడ్డుకుంది.  చుట్టుపక్కల వారు అంతా గూమికూడటంతో దాడికి యత్నించిన వ్యక్తి పరారయ్యాడు.

దాడికి పాల్పడిన  వ్యక్తి కొన్నాళ్లుగా ఒక యువతిని  ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఆమె తనకు కాబోయే భర్తతో బయటకు వచ్చిన సమయంలో నిందితుడు ఆ యువకుడిపై దాడి చేసేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. వారు శారదానగర్ కాలనీ వాసులుగా గుర్తించారు. యువతి అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనను చుట్టుపక్కల వారు వీడియో తీయటంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.