×
Ad

East Godavari : భార్యతో కలహాలు-పిల్లలతో కలిసి బంగార్రాజు ఆత్మహత్యాయత్నం

తూర్పు గోదావరి జిల్లా గోకవరానికి చెందిన తాతూరి బంగార్రాజు అనే వ్యక్తికి  భార్యా, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్యతో అతనికి కలహాలు ఉన్నాయి.

  • Published On : January 17, 2022 / 04:25 PM IST

man attempt suicide at east godavari

East Godavari : తూర్పు గోదావరి జిల్లా గోకవరానికి చెందిన తాతూరి బంగార్రాజు అనే వ్యక్తికి  భార్యా, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్యతో అతనికి కలహాలు ఉన్నాయి. భార్య ఉద్యోగ నిమిత్తం కువైట్ వెళ్లింది.  పిల్లలు ముగ్గురుని తల్లి సంరక్షణలో ఉంచి..చదువుల కోసం హాస్టల్ లో చేర్పించింది.

కాగా ఈనెల13న సంక్రాంతి పండుగ సందర్భంగా  బంగార్రాజు వంగలపూడి‌లోని   అత్తారింటికి వచ్చాడు.  ముగ్గురు పిల్లలు… 14 ఏళ్ల కుమార్తె, 12, 10 ఏళ్ల కుమారులను తీసుకుని సీతానగరం కైలాస భూమి వద్దకు  వచ్చాడు.  అప్పటికే మద్యం మత్తులో ఉన్న బంగార్రాజు కూల్ డ్రింక్ లో ఎలుకలమందు కలిపి పదేళ్ల కుమారుడు ప్రజ్వలత్ బలవంతంగా తాగించి తాను తాగాడు.
Also Read : YS Jagan Mohan Redddy : వ్యాక్సినేషన్ వేగవంతం చేయండి-సీఎం జగన్ ఆదేశం
మిగిలిన పిల్లలు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఘటనా స్ధలానికి వచ్చిన  పోలీసులు ఇద్దరినీ రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.