YS Jagan Mohan Redddy : వ్యాక్సినేషన్ వేగవంతం చేయండి-సీఎం జగన్ ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌లో రేపటి  నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ఈనేపధ్యంలో రాష్ట్రంలో  కోవిడ్‌ నివారణ,నియంత్రణ,వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లి

YS Jagan Mohan Redddy : వ్యాక్సినేషన్ వేగవంతం చేయండి-సీఎం జగన్ ఆదేశం

Ap Cm Ys Jagn Review In Covid

YS Jagan Mohan Redddy : ఆంధ్రప్రదేశ్‌లో రేపటి  నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ఈనేపధ్యంలో రాష్ట్రంలో  కోవిడ్‌ నివారణ,నియంత్రణ,వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్ధాయి అదికారులతో సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ  కింద రోగులకు సమర్థవంతంగా సేవలందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ఏ ప్రభుత్వాసుపత్రికి వెళ్ళినా పేషెంట్ ఆరోగ్య పరిస్థితిని వెంటనే తెలుసుకుని, వైద్యంకోసం ఎక్కడకు పంపాలన్న విధానం చాలా పటిష్టంగా ఉండాలని సీఎం అధికారులకు సూచించారు.  ఆరోగ్య శ్రీపై పూర్తి వివరాలు తెలిపేలా విలేజ్, వార్డ్‌ క్లినిక్స్‌లో, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెద్ద హోర్డింగ్‌పెట్టాలని సీఎం ఆదేశించారు.

ఆరోగ్యశ్రీ కింద పేషెంట్‌ రిఫరల్‌ వ్యవస్థపై రూపొందించిన స్టాండర్డ్‌ (ఎస్ఓపీ) ఆపరేషన్‌ప్రొసీజర్‌ను సీఎం జగన్ సమగ్రంగా సమీక్షించారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలకు, గ్రామ–వార్డు సచివాలయాల్లో ఆరోగ్య మిత్రలకు, పీహెచ్‌సీ ఆరోగ్య మిత్రలకు, 104 మెడికల్‌ ఆఫీసర్‌కు, 108 మెడికల్‌ ఆఫీసర్‌కు రూపొందించిన ఎస్‌ఓపీలను కూడా  సీఎం పరిశీలించారు.

104,108,లు   పీహెచ్‌సీలు, ఇతర ఆరోగ్య కేంద్రాల్లో ఉండే డాక్టర్లు కూడా ఈ ప్రక్రియలో భాగమయ్యేలా, వారికి మంచి సేవలు అందించేలా ఈ రిఫరెల్‌  విధానం ఉండాలని సీఎం జగన్ అన్నారు. కోవిడ్ సమయంలో ఆరోగ్య మిత్రలు కీలకంగా వ్యవహరించాలని ఆయన చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఈ సేవల సమన్వయంకోసం యాప్‌ పనిచేయాలని ముఖ్యమంత్రి అధికారులకు తెలిపారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కోవిడ్‌ విస్తరణ పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెప్పారు. రెండో వేవ్‌తో పోల్చిచూస్తే…, ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్సకోసం పడకల సంఖ్యను కూడా పెంచి సిద్ధంచేశామని అధికారులు తెలిపారు.  అన్నిజిల్లాల్లో కలిపి 53,184 పడకలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు.

రాష్ట్రంలో నమోదైన దాదాపు 27వేల యాక్టివ్‌ కేసుల్లో కేవలం 1100 మంది మాత్రమే ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులుచెప్పారు. వీరిలో ఆక్సిజన్‌ అవసరమైన వారి సంఖ్య సుమారు 600 మంది మాత్రమేనని అధికారులు చెప్పగా…ఈమేరకు వైద్య పరంగా అవసరాలను గుర్తించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.

గతంలో ఆస్పత్రిలో జాయిన్ అయిన రెండు వారాలకు డిశ్చార్జ్ చేసేవారమని… ఇప్పడు ఆ వ్యవధి వారం రోజులే అని అధికారుల సీఎంకు తెలిపారు.  గతంలో ముఖ్యమంత్రి ఆదేశించిన విధంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక కోవిడ్‌కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు.

104 కాల్ సెంటర్ పై సమీక్షించిన ముఖ్యమంత్రి … కాల్ సెంటర్‌లలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుని, టెలిమెడిసిన్ ద్వారా కాల్ చేసిన వారికి వైద్యం అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

రెండో డోస్ వ్యాక్సినేషన్‌వేయటంలో వెనుక బడ్డ జిల్లాలైన తూర్పుగోదావరి,గుంటూరు, వైయస్సార్‌కడప, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆ ఐదు జిల్లాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.

నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 15 నుంచి 18 ఏళ్లవారికీ 100శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తిచేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి   తెలిపారు. మరో 5 జిల్లాల్లో 90శాతానికిపైగా ఈ వయసుల  వారికి వ్యాక్సినేషన్‌ పూర్తయిందని… మరో నాలుగు జిల్లాల్లో 80శాతానికిపైగా వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
Also Read : Exams Postponed : కోవిడ్ ఎఫెక్ట్…పరీలుక్షలు వాయిదా వేస్తున్న యూనివర్సిటీలు
కోవిడ్‌ పరీక్షల్లో కేంద్రం కొత్త మార్గదర్శకాలపైనా ఈ సమావేశంలో చర్చించారు. కొత్త మెడికల్‌కాలేజీల నిర్మాణ ప్రగతిపైనా ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణశ్రీనివాస్(నాని), సీఎస్‌ సమీర్‌ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్ తదితరలు పాల్గోన్నారు.