Exams Postponed : కోవిడ్ ఎఫెక్ట్…పరీలుక్షలు వాయిదా వేస్తున్న యూనివర్సిటీలు
రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈనెలఖరువరకు విద్యాసంస్థలకు సెలవలు ప్రకటించింది. మరోవైపు ఈనెల 30 వరకుజరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు య

University Exams Post Poned
Exams Postponed : రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈనెలఖరువరకు విద్యాసంస్థలకు సెలవలు ప్రకటించింది. మరోవైపు ఈనెల 30 వరకుజరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు యూనివర్సిటీలు ప్రకటించాయి.
కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రకటించింది. దీంతో తెలంగాణ పరిధిలో ఈనెల 30వరకు
నిర్వహించనున్న అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించాయి యూనివర్సిటీలు. ఇప్పటికే సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పరీక్షలను కూడా
వాయిదా వేస్తున్నాయి వర్శిటీలు.
Also Read : Rains In Andhra,Telangana : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
అయితే పరీక్షల కొత్త షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని యూనివర్సిటీ అధికారులు వెల్లడిస్తున్నారు. నిజానికి మంగళవారం నుంచి జరగాల్సిన డిగ్రీ పరీక్షలను సైతం వాయిదా వేసినట్లు ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటించింది. మరోవైపు సోమవారం నుంచి ఈనెల 30 వరకు ఆన్ లైన్‌లో క్లాసులు నిర్వహించనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. మిగతా యూనివర్సిటీలు కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.