Man Drowns In Pond : సెల్ఫీ దిగుతూ కాలు జారి చెరువులో పడి యువకుడు మృతి

సెల్ఫీ దిగుతూ కాలుజారి చెరువులోపడి సాయి అనే యువకుడు మృతి చెందిన ఘటన హయత్‌నగర్‌లో చోటు చేసుకుంది.

Man Drown Into A Pond

Man Drowns In Pond : సెల్ఫీ దిగుతూ కాలుజారి చెరువులోపడి సాయి అనే యువకుడు మృతి చెందిన ఘటన హయత్‌నగర్‌లో చోటు చేసుకుంది.  పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని  సదాశివ ఎన్‌క్లేవ్ లో జరుగుతున్న ఒక కార్యక్రమానికి సాయి అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి క్యాటరింగ్ పని కోసం వచ్చారు.

శనివారం సదాశివ ఎన్‌క్లేవ్ పక్కనే ఉన్న చెరువు దగ్గరకి నలుగురూ  వెళ్లి సెల్ఫీలు  దిగుతుండగా సాయి అనే వ్యక్తి కాలుజారి చెరువులో పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలం వద్దకు వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు.