అసలు మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది. వీరు ఎలా ఆలోచిస్తారో తెలిస్తే షాక్ అవుతారు. ఇంత దారుణంగా ఆలోచిస్తారా? అని తిట్టిపోస్తారు కూడా. ఉత్తరప్రదేశ్ లోని అజమ్ గఢ్ లో గతవారమే జరిగిన అత్యాచార ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. తల్లీ కూతుర్ని అతిదారుణంగా చంపేసి ఆపై వారిని అత్యాచారం చేసినట్టు సిగ్గులేకుండా చెబుతున్నాడా నిందితుడు.
పేరు.. నజీరుద్దీన్.. గత సోమవారం అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు చిక్కిన నజీర్.. తాను ఎలా అత్యాచారం చేశాడో వివరణ ఇచ్చాడు. పైగా అదంతా వీడియో కూడా రికార్డు చేసినట్టు తెలిపాడు. అది విన్న పోలీసులే షాక్ అయ్యారు. చనిపోయిన మహిళపై అత్యాచారం చేయకుండా తాను వదల్లేదని చెప్పాడు. పోలీసుల విచారణలో అతడు చెప్పిన ఈ మాట విన్న ప్రతిఒక్కరి రక్తం మరిగిపోతుంది. వెంటనే ఉరి తీయండి ఆ మృగాన్ని అని డిమాండ్ చేస్తున్నారు.
భర్తను చంపి.. ఆపై ఇద్దరిని :
మహిళతో పాటు ఆమె 10ఏళ్ల కుమార్తెను కూడా చంపేసి ఇద్దరిపై అత్యాచారం చేశానని తెలిపాడు. కొన ఊపిరితో ఉన్న ఆ మహిళపై అత్యాచారం చేసి.. ఆ తర్వాత చనిపోయాక కూడా మరోసారి అత్యాచారం చేసినట్టు చెప్పుకొచ్చాడు. ‘ఆ రోజు రాత్రి.. నేను ఆ ఇంటి తలుపును గట్టిగా తోశాను. డోర్ తెరిచి ఇంట్లోకి ప్రవేశించాను. అదే సమయంలో వెదురు కర్ర ఒకటి కింద పడింది.
ఆ శబ్దానికి మంచంపై నిద్రపోతున్న మహిళ భర్త (35) లేచాడు. పక్కనే ఉన్నా ఇటుకతో అతడి తలపై గట్టిగా కొట్టాను. మరోసారి ఇటుకతో మోదడంతో అతడు మంచంపై నుంచి కిందపడి చనిపోయాడు. ఆ శబ్దం విని మహిళ కూడా లేచింది. ఆమెను కూడా ఇటుకతో గట్టిగా మోదాను. వీరిద్దరి మధ్య 10ఏళ్ల బాలిక నిద్రిస్తోంది. ఆ బాలికను కూడా ఇటుకతో కొట్టడంతో చనిపోయింది. ఇంట్లో నేను చూసిన ప్రతిఒక్కరిని చంపేశాను’ అంటూ పోలీసులకు చెప్పాడు.
అత్యాచారానికి పక్కా ప్లాన్ :
చేసిన నేరానికి ఏమాత్రం పశ్చాతాపం లేదు అతడికి. కళ్లలో భయం లేదు. తానేదో గొప్ప కార్యం చేసినవాడిలా హత్య చేసిన విధానాన్ని చెప్పుకొచ్చాడు. తాను ఎలా ప్లాన్ చేశాడో? ఎలా చంపి అత్యాచారం చేశాడో అంతా పూసగుచ్చినట్టు చెప్పేశాడు. కొన్నివారాల నుంచే మహిళా కుటుంబపై కన్నేసినట్టు తెలిపాడు. మహిళ కుటుంబమే లక్ష్యంగా ప్లాన్ సిద్ధం చేశానన్నాడు. మహిళ కుటుంబం గురించి వివరాలు సేకరించి, వారి ఇంటి సమీపంలో ఎలాంటి భద్రత లేదని గుర్తించాడు. తాను ఏంచేసినా పట్టించుకునే వారు ఉండరులే అనే ధీమాతో హత్యకు పథకం వేశాడు. అనుకున్నట్టుగానే పక్కా ప్లాన్ అమలు చేశాడు.
లైంగిక సామర్థ్యం పెంచే డ్రగ్స్ తీసుకుని :
మహిళను అత్యాచారం చేయాలనే ఉద్దేశంతో ముందుగానే నిందితుడు నజీరుద్దీన్.. లైంగిక సామర్థ్యాన్ని పెంచే డ్రగ్స్ తీసుకున్నట్టు ఒప్పుకున్నాడు. మహిళ ఇంటికి చేరుకున్న సమయలో ఆ వీధింతా నిర్మానుష్యంగా ఉన్నట్టుగా గుర్తించాడు. అక్కడ ఎవరు లేని తెలిసి మెల్లగా మహిళ ఇంట్లోకి చొరబడ్డాడు. వారి ఇంటి బయట ఎవరో లైట్ ఆన్ చేస్తే.. బల్బ్ తొలగించాడు. ఇంటి ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్లి మహిళ సహా భర్త, 10ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేశాడు. తీవ్రగాయాలతో కొనఊపిరితో ఉన్న మహిళపై తొలుత అత్యాచారం చేశాడు.
3 గంటలు నిందితుడు ఇంట్లోనే :
‘ఆమె ఇంకా చనిపోలేదు. కొంచెం కదులుతూనే ఉంది. ఆమె శరీరాన్ని, చేతులను కదిలించడంతో నా చొక్కాపై భుజానికి దగ్గరలో రక్తపు మరకలు అంటాయి. అక్కడి నుంచి వెళ్లే ముందు రక్తపు మరకలు ఉన్నట్టు చూశాను. వెంటనే మళ్లీ వెనక్కి వచ్చి ఆ మరకలను శుభ్రం చేసుకున్నాను’ అని తెలిపాడు. మహిళ చనిపోయాక కూడా రెండోసారి ఆమెపై నిందితుడు అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. మూడు గంటల పాటు అదే ఇంట్లో ఉన్న నజీర్.. అక్కడ జరిగిందంతా వీడియో రికార్డు చేశానని చెప్పాడు. ఆ వీడియోను తన మరదలికి కూడా చూపించినట్టు విచారణలో అంగీకరించాడు.
10ఏళ్ల బాలికను ఎందుకు ‘హత్యాచారం’ చేశావంటే? :
మహిళపై హత్యాచారం చేసిన నిందితుడు ఆమె 10ఏళ్ల కూతురిని చంపి ఆపై అత్యాచారం చేశాడు. బాలికను ఎందుకు చంపావని పోలీసులు అడిగితే.. ‘ ఆ సమయంలో బాలిక లేచి మంచినీళ్లు ఇవ్వమని తల్లిని అడుగుతోంది. నిశబ్దంగా వెళ్లి నిద్రపోమ్మని అన్నాను. బాలిక గట్టిగా దొంగ.. దొంగ.. అంటూ అరవడం మొదలుపెట్టింది. అదే ఇటుకతో బాలికను కొట్టి చంపి మంచంపై పడేశాను. ఆ తర్వాత ఆ బాలికపై కూడా అత్యాచారం చేశాను’ అంటూ హత్యోదంతాన్ని వివరించాడు.
మరోవైపు హైదరాబాద్ వెటర్నరీ వైద్యురాలు ప్రియంకా రెడ్డిపై సాముహిక అత్యాచార ఘటనపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మహిళలకు రక్షణ లేదా అంటూ ప్రజలు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. అదే సమయంలో హత్యాచార నిందితుడి వీడియో బయటకు రావడం మరింత కలకలం రేపింది. నవంబర్ 27న హైదరాబాద్ లో ప్రియాంకను నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి ఆపై చంపి మృతదేహాన్ని కాల్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలతో అట్టుడికిపోయింది. ఆగ్రహానికి గురైన జనమంతా నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
అత్యాచారాలను ఆపలేమా? :
మహిళలపై అత్యాచారాలను అరికట్టలేమా? మానవ మృగాల్లా మారుతున్న అత్యాచార నిందితులను ఏం చేయాలి. ఏ శిక్ష విధించాలి? మనిషికొక దెబ్బ.. గొడ్డుకొక దెబ్బ అంటారు. మహిళల పట్ల ఆరాచకంగా ప్రవర్తించే ఇలాంటి మృగాలను ఎలా శిక్షించాలి? హత్యాచార నిందితులకు ఉరిశిక్ష విధిస్తే.. మహిళలపై అత్యాచార ఘటనలు ఆగిపోతాయా? అసలు సమస్య ఎక్కడ ఉంది. దీన్ని ఎలా పరిష్కరించాలి. ఏం చేస్తే ఇలాంటి అఘాయిత్యాలు ఆగిపోతాయి. శిక్షలతో సమసిపోయే సమస్య కాదు ఇది.
ఆ ఆలోచనలో మార్పు వచ్చిననాడే :
ఇంకేదో చేయాలి. శిక్షలతో మృగాల్లా మారినవారు మనుషుల్లా మారిపోతారా? అంటే సమాధానం లేని ప్రశ్న. ప్రశ్నకు ప్రశ్నే ఎప్పుడు బదులు కాకూడదు. రోజురోజుకీ అమాయకపు ఆడపిల్లలు కామంధుల చేతుల్లో నలిగిపోతున్నారు. నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. ఇలాంటి పశు సంస్కృతిని నాశనం చేసే ఆయుధమే లేదా? అంటే.. అందుకు ఒకటే మార్గం ఉందంటున్నారు మానసిక నిపుణులు.
ముందు.. మహిళలపై అత్యాచారానికి ప్రేరేపించే ఆలోచనలో మార్పు రావాలంటున్నారు. ఆ మార్పు వచ్చినప్పుడే ఏ మనిషి అయినా సాటి మనిషి పట్ల సానుకూలంగా వ్యవహరిస్తాడని అంటున్నారు. ఇది నిజమే. కానీ, మృగాల మనస్సును మార్చడం ఎలా? బండరాయిని అయినా కరిగించవచ్చు గానీ ఇలాంటి రాతి మనస్సుతో నిండిన మృగాలను మార్చడం కష్టమైన పనే కదా.