Crime & Rape news : ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేసేవాడు. లాక్ డౌన్ టైంలో ఉద్యోగం పోయింది. తనకే ఉద్యోగం లేదు మరొకరికి ఉద్యోగం ఇస్తానని నమ్మబలికాడు. అది నమ్మిన ఓ అమ్మాయి అతడి ట్రాప్‌లో పడింది. ఓ రోజు ఇంటర్వ్యూకి రమ్మని పిలిచాడు. అదే అవకాశం చేసుకుని ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఇంటర్వ్యూ చేయడానికి ఆఫీసుకు కాదు, ఇంటికి పిలిచాడు. ఒంటరిగా ఇంటర్వ్యూకు వచ్చిన అమ్మాయిని రూంలోకి తీసుకెళ్లి రేప్ చేశాడు. అక్కడనుంచి తప్పించుకున్న అమ్మాయి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు, అతన్ని పట్టుకున్నారు. రేపిస్ట్‌ను గుర్తుపట్టిందని పోలీసులు చెప్పారు.
ఘజియాబాద్‌లో బాధితురాలు ఉంటోంది. తూర్పుఢిల్లీలో ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ, కొత్తగా వాట్స్‌ప్ గ్రూప్‌లో చేరింది. ఎక్కడైనా జాబ్ ఉందో చెప్పమంది. ఆ గ్రూపులోనే నిందుతుడు కూడా మెంబర్.
తనకున్న ఉద్యోగం ఇంతకు ముందే పోయింది. అయినా తాను జాబ్ ఇప్పిస్తానని, బాధుతురాలని కాంటాక్ట్ చేశాడు. మంచి జాబ్ అని నమ్మించి, ఇంటి అడ్రస్ ఇచ్చాడు. ఆపీసు అడ్రస్ అనుకొని బాధితురాలు వెళ్లింది.