ప్రియుడి మర్డర్ స్కెచ్ : గర్ల్ ఫ్రెండ్ గొంతు కోసి.. ముక్కలుగా చేశాడు

ప్రియురాలిని గొంతు కోసి చంపేసి ఆపై ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి కాలువలో పారేసిన ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది.

  • Publish Date - August 31, 2019 / 12:29 PM IST

ప్రియురాలిని గొంతు కోసి చంపేసి ఆపై ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి కాలువలో పారేసిన ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది.

ప్రియురాలిని గొంతు కోసి చంపేసి ఆపై ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి కాలువలో పారేసిన ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది. మిస్టరీగా మారిన ఈ కేసును రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు ఛేదించి ప్రియుడే ఈ హత్య చేసినట్టు గుర్తించారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. మహమ్మద్ అయూబ్ వికీ (32) టర్క్ మ్యాన్ గేట్ నివాసిగా ఢిల్లీ పోలీసు స్పెషల్ సేల్ గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. నాలుగేళ్ల క్రితం జీబీ రోడ్డులో వ్యభిచార గృహానికి వెళ్లిన సమయంలో అయూబ్ లత అలియాస్ సాల్మా అనే యువతితో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి వీరిద్దరూ సహజీవనం కొనసాగిస్తున్నారు. 2008లో అయూబ్ కు మరో మహిళతో పెళ్లి అయింది. 

అతడికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ లతతో సహజీవనం సాగిస్తు వచ్చాడు. నాలుగేళ్ల సహజీవనం తర్వాత అయూబ్ లతను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తన వ్యభిచార వృత్తిని వదిలేయమని చెప్పాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. పదేళ్ల క్రితమే తనకు పెళ్లి అయినప్పటికీ అయూబ్ లతను మరో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. లత పెళ్లికి ఒప్పుకోలేదు. మరో దారి లేక ఆయూబ్ ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఆగస్టు 20న సాయంత్రం మాట్లాడదామని పిలిచాడు. ఒక స్కూటర్ అద్దెకు తీసుకున్నాడు. అందులో ఒక పదునైన కత్తిని దాచాడు. బవన కాలువ దగ్గరకు లతను తీసుకెళ్లాడు. సరైన అవకాశం కోసం ఎదురుచూసిన ఆయూబ్.. నిర్మానుష్య ప్రాంతంలో లత గొంతును కత్తితో కోసి చంపేశాడు. 

అనంతరం ఆమె మృతదేహాన్ని ఐదు ముక్కులుగా చేసి పక్కనే ఉన్న కాలువలో పారేసి వెళ్లిపోయాడు. దీంతో లత మృతదేహాన్ని గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది. మరుసటి రోజున మృతదేహానికి సంబంధించి ముక్కలు కాలువలో లభ్యమయ్యాయి. కుళ్లిన దశలో ఉన్న లత మృతదేహాన్ని తొలుత పోలీసులు గుర్తించలేకపోయారు. ఈ క్రమంలో స్పెషల్ సెల్ విచారణ వేగవంతం చేయగా.. కేసులో ఓ క్లూ దొరికింది. ప్రియుడు ఆయూబ్ పై పోలీసులకు అనుమానం వచ్చింది. ఢిల్లీ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన అతన్ని పట్టుకుని అరెస్ట్ చేశారు. స్కూటర్ తో పాటు కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.