Man Stabbed To Death : అప్పుగా తీసుకున్న రూ.300 తిరిగి ఇవ్వలేదని యువకుడి హత్య
స్నేహితుడి దగ్గర తీసుకున్న రూ.300 అప్పు తిరిగి ఇవ్వటంలో విఫలం అయినందుకు రుణం ఇచ్చిన వ్యక్తి తీసుకున్న వ్యక్తిని హత్య చేసిన దారుణ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.
- chvmurthy
- Published On : October 5, 2021 / 10:52 AM IST
Delhi Police
Man Stabbed To Death : స్నేహితుడి దగ్గర తీసుకున్న రూ.300 అప్పు తిరిగి ఇవ్వటంలో విఫలం అయినందుకు రుణం ఇచ్చిన వ్యక్తి తీసుకున్న వ్యక్తిని హత్య చేసిన దారుణ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.
ఢిల్లీలోని ఆనంద్ పర్బత్ ప్రాంతంలో మందుల షాపులో పని చేసే శైలేంద్ర తన స్నేహితుడు రవి వద్ద గతంలో రూ.300లు అప్పుగా తీసుకున్నాడు. ఇటీవల రవి తన డబ్బులు తిరిగి ఇవ్వమని శైలేంద్రను వత్తిడి చేయసాగాడు. చెప్పిన టైము కు శైలేంద్ర డబ్బులు తిరిగి ఇవ్వలేక పోయాడు.
ఈ క్రమంలో అక్టోబర్ 2వ తేదీన రవి మరో నలుగురు స్నేహితులతో కలిసి శైలేంద్రను అప్పు విషయమై నిలదీశాడు. ఈక్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశంలో రవి, ఇతరులు కలిసి శైలేంద్రను హత్య చేశారు.
సమాచారం తెలుసుకుని ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హత్యకు కారణమైన రవితో సహా మరో నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
