Maoist Saradakka
Maoist Leader Sharadakka : మావోయిస్టు నేత, బజ్జర సమ్మక్క అలియాస్ శారదక్క తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట హైదరాబాద్‌లో లొంగిపోయారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతూ ఉండటం…ఆమె భర్త, మావోయిస్టు నాయకుడు హరిభూషణ్ కోవిడ్ తో కన్నుమూయటం కూడా ఆమె లొంగిపోవటానికి ప్రధాన కారణంగా చెపుతున్నారు.
శారదక్క మవోయిస్టు పార్టీలో సెంట్రల్ కమిటీ మెంబర్ గా, తెలంగాణ సెక్రటరీ గా పని చేసారు. 1994లో మైనరుగా ఉన్న సమయంలోనే ఆమె ఉద్యమంలో చేరారు. పాండవదళంలో హరిభూషణ్ శారదక్క ని పార్టీలోకి తీసుకెళ్లాడు. అనంతరం 1995లో ఆమె హరిభూషణ్ ను పెళ్లి చేసుకుంది. 1999-2000సంవత్సరంలో నార్త్ జోన్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గా పని చేసింది.
Also Read : Raju : రాజు నేరచరితుడే.. ఎల్బీనగర్ లో చోరీకి యత్నం
2005 నుండి 2008 వరకు చెర్ల కమాండర్ గా శారదక్క పని చేసింది. 2006 లో జరిగిన ఎన్ కౌంటర్ లో కంటి పక్కన బుల్లెట్ దిగింది. 2008 లో వరంగల్ ఎస్పీ ముందు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసింది. 2011 లో భర్త హరిభూషణ్ ద్వారా తిరిగి ఉద్యమంలోకి వెళ్లింది. 2016 వరకు భర్త హరిభూషణ్ తో ఉంది.
శారదక్కపై 25 కి పైగా కేసులున్నాయి. ఆజాద్, రాజిరెడ్డి ఆరోగ్యం బాగోలేక బయటకి రావాలని చూస్తున్నారు…. కానీ వారిని మావోయిస్టు లీడర్స్ లోంగిపోవద్దని వత్తిడి చేస్తున్నారని శారదక్క తెలిపింది. కాగా లోంగిపోయిన మావోయిస్టునేత శారదక్కకు రూ.5 లక్షల రూపాయలు ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు.
కరోనా వల్ల మావోయిస్టు పార్టీ పరిస్ధితి దయనీయంగా ఉందని ఆయన అన్నారు. కొంతమంది మావోయిస్టు నాయకులు లొంగిపోవడానికి రెడి గా ఉన్నారని ఆయన చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులకు రక్షణ కల్పిస్తామని… అనారోగ్యంతో ఉన్నమావోయిస్టులు లొంగిపోవాలని డీజీపీ కోరారు. ప్రజల నుండి మావోయిస్టులకు ఎలాంటి సహకారం అందడం లేదని..తెలంగాణ నుంచి మావోయిస్టుల్లో ఎవరూ చేరటం లేదని డీజీపి తెలిపారు.