మావోయిస్టు లేఖ కలకలం : ఆందోళనలో సర్పంచ్ లు

  • Publish Date - March 12, 2019 / 06:33 AM IST

వనపర్తి: వనపర్తి జిల్లాలో చందాలు ఇవ్వాలని  బెదిరిస్తూ మవోయిస్టుల పేరుతో వచ్చిన లేఖలు కలకలం సృష్టించాయి. చిన్నాంబావి మండలంలోని నలుగురు  గ్రామ పంచాయితీ సర్పంచ్‌లకు 20లక్షల రూపాయలు ఇవ్వాలంటూ బెదిరిస్తూ లేఖలు వచ్చాయి. జిల్లాలోని మియాపూర్ తండా చిన్నంబాయి మండలం లోని మావోయిస్టులు సూచించిన నలుగురిలో ఎవరో ఒకరికి 20 లక్షలు ఇవ్వాలని అందులో ఆదేశించారు.  మీరు డబ్బు ఇవ్వకపోతే మీ ఆస్తి మొత్తం సర్వ నాశనం చేయటానికి కూడా వెనుకాడమని అందులో పేర్కొన్నారు.  ఫిబ్రవరి నెల 20,22 వ తేదీతో ఈ లేఖలు విడుదలయ్యాయి. దీంతో నూతనంగా ఎన్నికైన సర్పంచులు భయాందోళన చెందుతున్నారు.

.. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఒకప్పుడు చిన్నంబావి మండలానికి చెందిన కొంతమంది దళంలో పని చేశారని.. వారు చనిపోవడంతో వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.. దీనిపై నాగర్ కర్నూల్  జిల్లా ఎస్పీ విచారణ చేపట్టారు..