వయస్పు పైబడినవారు, విడాకులు తీసుకున్న వారే ఆమె టార్గెట్.. మ్యాట్రిమోనీ ద్వారా గాలం వేస్తుంది.. పెళ్లి సంబంధం పేరుతో నమ్మిస్తుంది.. పెళ్లి కాగానే కొన్ని వారాలకు ఇంట్లో నగలు, డబ్బుతో ఊడాయిస్తుంది.. ఇదే గత 10ఏళ్లుగా ఈ కిలాడీ మహిళ ట్రాక్ రికార్డ్.. పది ఏళ్ల కాలంలో 8 మంది సినీయర్ సిటిజన్లను పెళ్లాడింది. వారాల వ్యవధిలోనే అందినకాడికి దోచుకుని జంప్ అవుతుంది..
అచ్చం బాలీవుడ్ మూవీ ‘లూటెరి దుల్హాన్’ మాదిరిగా ఈ మహిళ మోసాలకు పాల్పడుతోంది.. ముదసలి వయస్సులో ఉన్నవారే లక్ష్యంగా దొంగ పెళ్లిళ్లు చేసుకుంటుంది.. డబ్బు చేతికి వచ్చాక పారిపోతుంది.. నిర్మాణ కాంట్రాక్టర్ జుగల్ కిషోర్ అనే 66ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకుని మోసగించింది. ఘజియాబాద్ లోని కవి నగర్ లో బాధితుడు నివసిస్తున్నాడు..
గత ఏడాదిలోనే తన భార్య మృతిచెందడంతో తాను ఒంటరిగా ఉంటున్నాడు.. ఒంటరితనాన్ని భరించలేక మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.. సీనియర్ సిటిజన్లు, విడాకులు తీసుకున్న వ్యక్తలకు మ్యాచ్ చూస్తామని ఢిల్లీకి చెందిన ఖన్నా వివా కేంద్రం అనే మ్యాట్రిమోనియల్ ఏజెన్సీ ప్రకటన ఇచ్చింది. ఆ యాడ్ చూసిన అతడు ఆ ఏజెన్సీని సంప్రదించాడు.. మోనికా మాలిక్ అనే మహిళకు పరిచయం చేశారు.. తాను విడుకులు తీసుకున్నానని ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నానని బాధితుడికి చెప్పింది.
అది నమ్మిన అతడు ఆగస్టులో 2019లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. బాధితుడు కిషోర్ తో కలిసి కొన్నివారాల పాటు ఇంట్లోనే ఉంది.. సరిగ్గా రెండు నెలల తర్వాత కిషోర్ ఇంట్లోని నగలు, డబ్బులు తీసుకుని చెప్పకుండా పరారైపోయింది. అక్టోబర్ 26, 2019న మోనికా రూ.15 లక్షల విలువైన వస్తువులతో పారిపోయిందని వాపోయాడు.
తనకు పరిచయం చేసిన మ్యాట్రిమోనీ ఏజెన్సీని సంప్రదించాడు.. మహిళ మోసాన్ని బయటపెట్టాడు.. మోసపోయిన తనపై మాట్రిమోనీ ఏజెన్సీ తప్పుడు కేసు పెడతానంటూ బెదిరించింది.. డబ్బులు గుంజాలని ప్రయత్నించింది.. ఆ తర్వాత బాధితుడు కిషోర్.. మోనికా మునుపటి భర్త గురించి ఆరా తీశాడు.. అతడి దగ్గరకు వెళ్లి మోనికా గురించి అడిగాడు.. అతడు కూడా తనలానే మోసపోయినట్టు తెలుసుకున్నాడు.. వెంటనే కిషోర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.. గత పదేళ్లలో మోనికా ఎనిమిది మంది సీనియర్ సిటిజన్లను మోసం చేసిందని పోలీసులు గుర్తించారు. పెళ్లి చేసుకోవడం వారాల తర్వాత ఇంట్లో నగదు, అభరణలతో పారిపోవడం చేస్తోందని విచారణలో నిర్ధారించారు పోలీసులు.
నిందితురాలు పెళ్లిళ్లు అన్నింటిని ఖన్నా వివా కేంద్రం అనే మ్యాట్రిమోనీ ఏజెన్సీ నిర్ణయించినట్టు పోలీసుల విచారణలో తేలింది. మోసాలకు పాల్పడిన మహిళ మోనికా, ఆమె కుటుంబంతో పాటు మాట్రిమోనియల్ ఏజెన్సీపై కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు..