పేలిన ఇంధన పైప్‌లైన్‌ : 20 మంది సజీవదహనం

మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంధన పైప్‌లైన్‌ పేలి 20 మంది మృత్యువాత పడ్డారు. మరో 54 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇంధనం సరఫరా అయ్యే పైప్‌‌లైన్ లీకవడంతో ఈ ఘటన జరిగింది.

  • Publish Date - January 19, 2019 / 05:47 AM IST

మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంధన పైప్‌లైన్‌ పేలి 20 మంది మృత్యువాత పడ్డారు. మరో 54 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇంధనం సరఫరా అయ్యే పైప్‌‌లైన్
లీకవడంతో ఈ ఘటన జరిగింది.

మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంధన పైప్‌లైన్‌ పేలి 20 మంది మృత్యువాత పడ్డారు. మరో 54 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇంధనం సరఫరా అయ్యే పైప్‌‌లైన్
లీకవడంతో ఈ ఘటన జరిగింది. లీకైన ఇంధనాన్ని వెంట తెచ్చుకున్న డబ్బాల్లో నింపుకుంటుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనమయ్యారు. మెక్సికో సిటీలోని త్లాహులిల్‌పాన్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది.  మెక్సికోలో ఇంధన చోరీ ఘటనలు తరచు జరుగుతుంటాయి. 

ఇంధనాన్ని చోరీ చేసేందుకు దొంగలు పైప్‌లైన్‌ పగలగొట్టినట్లు అధికారులు తెలిపారు. పైప్‌లైన్‌ లీక్ అవుతుందని తెలిసిన స్థానికులు వెంటనే అక్కడికి పరుగులు తీశారు. బకెట్లు, క్యాన్లలో ఇంధనాన్ని తెచ్చుకునేందుకు బారులు తీరారు. దురదృష్టవశాత్తు అదే సమయంలో పైప్‌లైన్‌ పేలడంతో పెను ప్రమాదం జరిగింది. కాలిన గాయాలతో బాధపడుతున్న వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు స్టేట్‌ గవర్నర్‌ ఒమర్‌ ఫయద్‌ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.  

ట్రెండింగ్ వార్తలు