అగ్ని ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ స్పందించారు.
హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. స్టాల్స్ కు మంటలు వ్యాపించాయి. ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ స్పందించారు. భారీ అగ్నిప్రమాదంలో చెలరేగిన మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు తెలిపారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని ఈటల సూచించారు. భారీ అగ్ని ప్రమాద ఘటనపై ఆయన ఆరా తీశారు. ఆస్తి నష్టం వివరాలు అంచనా వేసి నివేదిక ఇవ్వాలని ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శిని ఈటల రాజేందర్ ఆదేశించారు.