కూతురిని ప్రియుడి దగ్గరికి పంపిన తల్లి : విజయవాడలో దారుణం

మానవత్వం మంటగలిసింది. ఓ తల్లి సభ్యసమాజం తలదించుకునే పనిచేసింది. కూతుర్ని తన ప్రియుడి దగ్గరికి పంపించింది.

  • Publish Date - December 14, 2019 / 04:05 AM IST

మానవత్వం మంటగలిసింది. ఓ తల్లి సభ్యసమాజం తలదించుకునే పనిచేసింది. కూతుర్ని తన ప్రియుడి దగ్గరికి పంపించింది.

మానవత్వం మంటగలిసింది. ఓ తల్లి సభ్యసమాజం తలదించుకునే పనిచేసింది. కూతుర్ని తన ప్రియుడి దగ్గరికి పంపించింది. ఈ దారుణమైన ఘటన కృష్ణా జిల్లా పరిటాలలో జరిగింది.

14ఏళ్ల కూతుర్ని 56 ఏళ్ల వయసున్న తన ప్రియుడి దగ్గరికి పంపించింది. తల్లి ఎదురుగా కూతుర్ని చిత్రహింసలు పెట్టాడు ఆ దుర్మార్గుడు. అయినా తల్లి కనికరించలేదు కూతుర్ని బలవంతంగా ప్రియుడి దగ్గరకు చేర్చింది. 

తండ్రి చనిపోవడంతో ఆ బాలిక తన నానమ్మకు విషయాన్ని చెప్పింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.