Mumbai Bomb Threat: ముంబైలో పలుచోట్ల ఉగ్రదాడులంటూ ఫోన్ చేసిన వ్యక్తి అరెస్ట్

ముంబై మహానగరంలో పలు చోట్ల భారీ పేలుళ్లు జరగనున్నట్టు డయల్ 100 ద్వారా ఫోన్ చేసి.. ముంబై పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన ఓ వ్యక్తిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు

Mumbai Bomb Threat: ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కు చెందిన ఇల్లు “మన్నత్” సహా ముంబై మహానగరంలో పలు చోట్ల భారీ పేలుళ్లు జరగనున్నట్టు డయల్ 100 ద్వారా ఫోన్ చేసి.. ముంబై పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన ఓ వ్యక్తిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ కు చెందిన 35 ఏళ్ల జితేష్ ఠాకూర్ అనే వ్యక్తి ఈ తప్పుడు సమాచారం అందించినట్లు మహారాష్ట్ర పోలీసులు ప్రకటించారు. ముంబై పోలీసుల సమాచారం మేరకు.. ముంబైలోని ప్రముఖ జనసమూహ ప్రాంతాలైన ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT), కుర్లా రైల్వే స్టేషన్, షారూఖ్ ఖాన్ బంగ్లా సమీపంలోని ఖర్ఘర్ వద్ద మరియు నవీ ముంబైలోని గురుద్వారా దగ్గర ఉగ్రదాడులు, న్యూక్లియర్ దాడులు జరగనున్నట్టు జనవరి 6న ముంబై పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఉరుకులు పరుగుల మీద ఆయా ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. అయితే ఎక్కడా బాంబు జాడలు లేకపోవడం, నిఘావర్గాల వద్ద కూడా తగిన సమాచారం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు.. ఫోన్ చేసిన వ్యక్తి వివరాలు సేకరించారు.

Also read: Bomb Threat: తిరుపతి బస్టాండ్ వద్ద కలకలం సృష్టించిన సూట్ కేస్

ఫోన్ చేసిన వ్యక్తి మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్ కు చెందిన జితేష్ గా నిర్ధారించారు. ఆమేరకు జబల్‌పూర్ పోలీసులకు ముంబై పోలీసులు నిందితుడి వివరాలు చేరవేశారు. అనంతరం నిందితుడిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జితేష్ ఠాకూర్ ఉద్యోగం కోల్పోయి తాగుడుకు బానిసయ్యాడని, తరచూ మద్యం సేవించి ఇటువంటి గాలివార్తలను ప్రచారం చేస్తున్నాడని జబల్‌పూర్ పోలీసులు తెలిపారు. గతంలోనూ ఇటువంటి అసత్యవార్తలను ప్రచారం చేసిన నేరంలో జితేష్ ఠాకూర్ పై కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని మాటలను వినని పక్షంలో డయల్ 100 సిబ్బందితోనూ, పోలీసు సిబ్బందితోనూ తగువులాడేవాడని జబల్పూర్ అదనపు పోలీస్ సూపరింటెండెంట్ గోపాల్ ఖండేల్ పేర్కొన్నారు

Also read: Rajahmundry Police: రూ.కోటి విలువైన నాటు సారాను ధ్వంసం చేసిన రాజమండ్రి పోలీసులు

ట్రెండింగ్ వార్తలు