Rajahmundry Police: రూ.కోటి విలువైన నాటు సారాను ధ్వంసం చేసిన రాజమండ్రి పోలీసులు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో సుమారు కోటి రూపాయల విలువ చేసే నాటుసారాను అధికారులు ధ్వంసం చేశారు

Rajahmundry Police: రూ.కోటి విలువైన నాటు సారాను ధ్వంసం చేసిన రాజమండ్రి పోలీసులు

Aishwarya

Rajahmundry Police: అక్రమ మద్యం, నాటు సారా, గంజాయి సరఫరా వంటి అసాంఘిక కార్యకలాపాలపై.. పోలీసులు ఎంత నిఘా ఉంచినా కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుకుంటున్నారు. పోలీసుల కళ్ళుగప్పి జోరుగా అక్రమ మద్యాన్ని, నాటుసారాను తరలిస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో సుమారు కోటి రూపాయల విలువ చేసే నాటుసారాను అధికారులు ధ్వంసం చేశారు. రాజమండ్రి అర్బన్ పరిధిలోని బొమ్మూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవల పలు సందర్భాల్లో పట్టుబడిన అక్రమ నాటుసారాను మంగళవారం రాజమండ్రి అర్బన్ ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆధ్వర్యంలో ఎస్ఈబీ అధికారులు, పోలీసు సిబ్బంది సంయుక్తంగా ధ్వంసం చేశారు.

Also Read: Srilanka-India: లగ్జరీ రైలు కోసం శ్రీలంకకు సహకారం అందించిన భారత్

రాజమండ్రి అర్బన్.. బొమ్మూరు పోలీసు స్టేషన్ పరిధిలోని కలవగొయ్య గ్రామా శివారులో ఉన్న ఖాళీ స్థలానికి ఈ నాటుసారా కేసులను తరలించారు. ఎస్ఈబీ అధికారుల సమక్షంలో వివరాలు నమోదు అనంతరం మొత్తం 1543 కేసుల్లో ఉన్న 59 వేల లీటర్ల నాటుసారాను పోలీసులు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన నాటుసారా విలువ సుమారు రూ.కోటి ఉంటుందని ఎస్ఈబీ అధికారులు పేర్కొన్నారు. అనంతరం ఎస్పీ ఐశ్వర్య రస్తోగి మాట్లాడుతూ ఇటీవల నాటుసారా అక్రమ రవాణా అధికంగా ఉంటోందని, ఇటువంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కావున నాటుసారా, గంజాయి సరఫరా వంటి పనులు మానుకోవాలని ఆయన హెచ్చరించారు.

Also Read: TATA IPL: వీవో ఐపీఎల్ బదులు టాటా ఐపీఎల్‌గా పేరు మార్పు